బాలీవుడ్ కు తెలుగు కథలే దిక్కు?
దేశంలో సినిమాలంటే హిందీవే అన్నట్టుగా ఒకప్పుడు ఉండేవి.. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ అంతా హిందీ సినిమాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా ఉర్రూతలూగించి.. కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి. కానీ నేడు బాలీవుడ్ కు కథల కొరత వెంటాడుతోంది. తెలుగు సినిమాలను వరుసగా రిమేక్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. ఈ సంస్కృతి ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగు అర్జున్ రెడ్డి మూవీ హిందీలో కబీర్ […]
దేశంలో సినిమాలంటే హిందీవే అన్నట్టుగా ఒకప్పుడు ఉండేవి.. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ అంతా హిందీ సినిమాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా ఉర్రూతలూగించి.. కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి.
కానీ నేడు బాలీవుడ్ కు కథల కొరత వెంటాడుతోంది. తెలుగు సినిమాలను వరుసగా రిమేక్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. ఈ సంస్కృతి ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగు అర్జున్ రెడ్డి మూవీ హిందీలో కబీర్ సింగ్ గా వచ్చి 300 కోట్లకు పైగా కొల్లగొట్టింది.
1997లో హలో బ్రదర్ అంటూ నాగార్జున తెలుగులో తీసిన బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో వరుణ్ ధావన్ ‘జాడ్వా2’ అని తీయగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 200 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరిని హిందీలో సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’ పేరుతో తీసి కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ సినిమా 233 కోట్లు వసూలు చేసింది. ఇక ఇదే సల్మాన్ తెలుగులో హిట్ అయిన రవితేజ ‘కిక్’ మూవీని హిందీలో తీసి బ్లాక్ బ్లస్టర్ కొట్టాడు.. ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్లు సాధించింది.
ఇక తెలుగు రెడీని కూడా సల్మాన్ రెడీ పేరుతో కాపీ కొట్టాడు. విక్రమార్కుడు సినిమాను రౌడీ రాథోడ్ గా అక్షయ్ కుమార్ తీసి సంచలన విజయం అందుకున్నాడు. తెలుగు ఖుషీని హిందీలో తీశారు. తెలుగులో చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ మూవీని హిందీలో గోవిందా ఖున్వారా తీసి ఇండస్ట్రీకి హిట్ ఇచ్చాడు. తెలుగు శుభలగ్నం మూవీని హిందీలో జుడాయిగా తీసి అనిల్ కపూర్ శ్రీదేవి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చారు.
ఇక తొలిప్రేమను ముజేఖుచ్ కేహానా హై.. అతడు మూవీని ఏక్ థా పవర్ ఆఫ్ వన్ అని… మర్యాద రామన్నను సన్ ఆఫ్ సర్ధార్ గా తీసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.