ఓపెనర్ గా 10వేల పరుగుల రోహిత్ శర్మ
హామిల్టన్ టీ-20తో రోహిత్ రికార్డు భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఓపెనర్ గా క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 10వేల పరుగులు సాధించిన భారత మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన మూడో టీ-20లో రోహిత్ 10వేల పరుగుల మైలురాయిని చేరాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగి 40 బాల్స్ లో 65 పరుగులతో టాప్ స్కోరర్ గా […]
- హామిల్టన్ టీ-20తో రోహిత్ రికార్డు
భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఓపెనర్ గా క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 10వేల పరుగులు సాధించిన భారత మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.
హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన మూడో టీ-20లో రోహిత్ 10వేల పరుగుల మైలురాయిని చేరాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగి 40 బాల్స్ లో 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత …సూపర్ ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదడం ద్వారా భారత్ ను విజేతగా నిలిపాడు.
భారత క్రికెట్ చరిత్రలో ఓపెనర్ గా 10వేల పరుగులు సాధించిన ఆటగాళ్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. ఇప్పుడు రోహిత్ శర్మ.. ఆ ఘనత సాధించిన భారత మూడో ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.
టెస్టులు, వన్డేలు, టీ-20ల్లో శతకాలు బాదిన అరుదైన క్రికెటర్ గా పేరున్న రోహిత్ కు…వన్డే క్రికెట్లో ప్రపంచరికార్డుతో పాటు మూడు డబుల్ సెంచరీలు బాదిన అరుదైన రికార్డు సైతం ఉంది.