Telugu Global
NEWS

సూపర్ ఓవర్లో రోహిత్ సూపర్ హిట్

న్యూజిలాండ్ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర టీ-20ల్లో తొలి సిరీస్ నెగ్గిన విరాట్ సేన న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా టీ-20 సిరీస్ నెగ్గాలన్న భారత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. పాంచ్ పటాకా సిరీస్ లో భాగంగా… హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా ముగిసిన సూపర్ ఓవర్ థ్రిల్లర్లో భారత్ విజేతగా నిలిచింది. రోహిత్ ధూమ్ ధామ్ బ్యాటింగ్…. ఐదుమ్యాచ్ ల సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ మూడో మ్యాచ్ లో…టాస్ ఓడి ముందుగా […]

సూపర్ ఓవర్లో రోహిత్ సూపర్ హిట్
X
  • న్యూజిలాండ్ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర
  • టీ-20ల్లో తొలి సిరీస్ నెగ్గిన విరాట్ సేన

న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా టీ-20 సిరీస్ నెగ్గాలన్న భారత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. పాంచ్ పటాకా సిరీస్ లో భాగంగా… హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా ముగిసిన సూపర్ ఓవర్ థ్రిల్లర్లో భారత్ విజేతగా నిలిచింది.

రోహిత్ ధూమ్ ధామ్ బ్యాటింగ్….

ఐదుమ్యాచ్ ల సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ మూడో మ్యాచ్ లో…టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగుల స్కోరు సాధించింది.

ఓపెనర్ రోహిత్ శర్మ 40 బాల్స్ లో 6 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ రాహుల్ 27, కెప్టెన్ విరాట్ కొహ్లీ 38 పరుగులు సాధించారు.

కేన్ విలియమ్స్ సన్ షో…

180 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ ను కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ …విజయం అంచుల వరకూ తీసుకెళ్లాడు. విలియమ్స్ సన్ కేవలం 48 బాల్స్ లోనే 8 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 95 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షమీ బౌలింగ్ లో విలియమ్స్ సన్ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగి.. చివరకు టైగా ముగిసింది. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసి…భారత్ తో సమఉజ్జీగా నిలవడంతో…సూపర్ ఓవర్ పాటించారు.

రోహిత్ సిక్సర్ల హిట్….

సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 6 బాల్స్ లో 17 పరుగులు నమోదు చేసింది. సమాధానంగా 18 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ మొదటి 4 బాల్స్ లో 10 పరుగులు చేయడంతో టెన్షన్ పెరిగిపోయింది. చివరి రెండుబాల్స్ లో ఎనిమిది పరుగులు చేయాల్సిన సమయంలో… సూపర్ హిట్టర్ రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో … సూపర్ విక్టరీ అందించాడు. భారత్ కు ఒంటిచేత్తో విజయం అందించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
అవార్డు దక్కింది.

తొలి సిరీస్ విజయం…

న్యూజిలాండ్ ను న్యూజిలాండ్ గడ్డపై టీ-20 సిరీస్ లో భారత్ ఒడించడం ఇదే మొదటిసారి. కివీ గడ్డపై న్యూజిలాండ్ తో ప్రస్తుత సిరీస్ లోని మూడో మ్యాచ్ వరకూ.. ఎనిమిదిసార్లు తలపడిన భారత్ 4-4 రికార్డుతో సమఉజ్జీగా నిలిచింది. సిరీస్ లోని నాలుగో టీ-20మ్యాచ్ జనవరి 31న వెలింగ్టన్ వేదికగా జరుగుతుంది.

First Published:  29 Jan 2020 10:28 PM GMT
Next Story