Telugu Global
International

కరోనా విలయం: 17 దేశాలు... 170 దాటిన మృతులు

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. క్షణక్షణానికి తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే 17 దేశాలకు విస్తరించి.. 170కి పైగా ప్రాణాలను బలితీసుకుందని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మరో 17 వందల కేసులు ఈ వైరస్ బారిన పడిన వారికి సంబంధించి నమోదయ్యాయి. చైనా నేషనల్ హెల్త్ మిషన్ చెబుతున్న లెక్కలు కూడా.. కరోనా ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. రోజుకు ఏకంగా.. 1,370 కేసులు నమోదవుతున్నాయని అంటున్న ఆ లెక్కలు.. […]

కరోనా విలయం: 17 దేశాలు... 170 దాటిన మృతులు
X

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. క్షణక్షణానికి తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే 17 దేశాలకు విస్తరించి.. 170కి పైగా ప్రాణాలను బలితీసుకుందని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మరో 17 వందల కేసులు ఈ వైరస్ బారిన పడిన వారికి సంబంధించి నమోదయ్యాయి.

చైనా నేషనల్ హెల్త్ మిషన్ చెబుతున్న లెక్కలు కూడా.. కరోనా ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. రోజుకు ఏకంగా.. 1,370 కేసులు నమోదవుతున్నాయని అంటున్న ఆ లెక్కలు.. జనాన్ని మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. చైనాలో నెలకొన్న ఈ పరిస్థితిని చూసి.. ప్రపంచ దేశాలు మరింత కంగారు పడుతున్నాయి.

తమ దేశాల నుంచి చైనాకు పలు విమానయాన సంస్థలు రాకపోకలు నిలిపేస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే.. మన దేశానికి చెందిన ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్ వేస్, లయన్ ఎయిర్, ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థలు ఉన్నాయి. ఈ జాబితాలో మరిన్ని సంస్థలు చేరే అవకాశమూ ఉంది.

ఇంతగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవాళ సమావేశమై.. కార్యాచరణ ఖరారు చేయనుంది.

First Published:  30 Jan 2020 2:31 PM IST
Next Story