ఇదిగో ఇందుకే... చైనాకు ఎవరూ సాటిలేరు !
కరోనా వైరస్ దెబ్బకు.. చైనా విలవిల్లాడుతోంది. ఇప్పటికే వందకు పైగా ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. ఈ వైరస్.. ఇతర దేశాలకూ పాకుతూ.. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఇంతటి విలయం నుంచి కూడా.. చైనా తనకే సాధ్యమైన అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. వుహాన్ పట్టణానికి అతి సమీపంలో.. కేవలం 48 గంటల్లో.. భారీ భవంతిని అందుబాటులోకి తెచ్చింది. ఈ భవనాన్ని వెయ్యి పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతోంది. మూడు రోజుల క్రితం పునాదులు తవ్విన ఈ భవనానికి.. ఓ వైపు నిర్మాణ కార్మికులు.. […]
కరోనా వైరస్ దెబ్బకు.. చైనా విలవిల్లాడుతోంది. ఇప్పటికే వందకు పైగా ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. ఈ వైరస్.. ఇతర దేశాలకూ పాకుతూ.. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఇంతటి విలయం నుంచి కూడా.. చైనా తనకే సాధ్యమైన అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. వుహాన్ పట్టణానికి అతి సమీపంలో.. కేవలం 48 గంటల్లో.. భారీ భవంతిని అందుబాటులోకి తెచ్చింది. ఈ భవనాన్ని వెయ్యి పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతోంది.
మూడు రోజుల క్రితం పునాదులు తవ్విన ఈ భవనానికి.. ఓ వైపు నిర్మాణ కార్మికులు.. మరోవైపు వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ.. నిజంగానే అద్భుతం సృష్టించారు. గోడల నిర్మాణం కొనసాగుతుండగానే… ఆక్సీజన్ పైపు లైన్లు, పడకలు, ఇతర వైద్య సామాగ్రిని సిద్ధం చేశారు. ఇప్పటికే తొలి బ్యాచ్ కు సంబంధించిన రోగులను ఈ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అలాగే.. వుహాన్ కు 75 కిలోమీటర్ల దూరంలోనే.. మరో భారీ ఆసుపత్రిని కరోనా వైరస్ బాధిత రోగుల కోసం అందుబాటులోకి తెస్తున్నారు. ఆ భవనం అందుబాటులోకి వచ్చే వరకు.. ఇందులో రోగులకు చికిత్స అందిస్తారు. మరో నాలుగైదు రోజుల్లో.. ప్రస్తుత భవన నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా కసరత్తు కొనసాగుతోంది. సాధారణంగా ఇలాంటి అత్యవసర పరిస్థితి వేరే దేశాల్లో వస్తే.. వైద్య సేవలు ఇంత త్వరగా లభిస్తాయని అనుకోలేం.
అందుకే.. అనుకున్నదే తడవుగా.. ప్రజల కోసం ఇంతటి బృహత్కార్యాన్ని అమలు చేసిన చైనాను.. అభినందించాల్సిందే.