బాలయ్య హిందూపూర్ పర్యటన.. రచ్చ రచ్చ
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన నియోజకవర్గమైన అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించిన సందర్భం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం.. ఇరు పక్షాల మధ్య తోపులాట వరకూ వెళ్లింది. రాయలసీమ ద్రోహి బాలకృష్ణ అంటూ వైసీపీ నేతలు.. బాలయ్యకు మద్దతుగా టీడీపీ కార్యకర్తల నినాదాలతో.. హిందూపురంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రహమతపురం సర్కిల్ లో పర్యటించిన బాలకృష్ణను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. […]
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన నియోజకవర్గమైన అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించిన సందర్భం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం.. ఇరు పక్షాల మధ్య తోపులాట వరకూ వెళ్లింది. రాయలసీమ ద్రోహి బాలకృష్ణ అంటూ వైసీపీ నేతలు.. బాలయ్యకు మద్దతుగా టీడీపీ కార్యకర్తల నినాదాలతో.. హిందూపురంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
రహమతపురం సర్కిల్ లో పర్యటించిన బాలకృష్ణను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. భారీగా పోలీసులను మోహరించాల్సి వచ్చింది.
మూడు రాజధానుల వ్యవహారంలో.. టీడీపీ, వైసీపీ పోటాపోటీ ప్రదర్శనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బాలయ్యపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓ రకంగా చెప్పాలంటే.. హిందూపురంలో భారీగా రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణ.. ప్రజలను కూడా ఆందోళనకు గురి చేసింది. రాజకీయాలు చేస్తే చేసుకోండి.. కానీ.. ఎవరినీ ఇబ్బంది పెట్టకండి అంటూ.. పార్టీల నేతలను కోరుకుంటున్నారు.