Telugu Global
NEWS

భారత మహిళా ఫుట్ బాల్ కెప్టెన్ అరుదైన రికార్డు

బాలాదేవికి రేంజర్స్ క్లబ్ కాంట్రాక్టు విదేశీక్లబ్ కాంట్రాక్టు పొందిన భారత తొలిమహిళ భారత మహిళా ఫుట్ బాల్ కెప్టెన్, డాషింగ్ ఫార్వర్డ్ బాలాదేవీ ఓ అరుదైన ఘనత సంపాదించింది. విదేశీక్లబ్ కాంట్రాక్టు సాధించిన భారత తొలి మహిళా సాకర్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్ కు చెందిన విశ్వవిఖ్యాత సాకర్ క్లబ్ రేంజర్స్ క్లబ్ తో బాలాదేవి కాంట్రాక్టు కుదుర్చుకొంది. గత నవంబర్ లో జరిగిన సెలెకషన్ ట్రైల్స్ లో పాల్గొన్న బాలాదేవి ఆటతీరుతో సంతృప్తి చెందిన రేంజర్స్ […]

భారత మహిళా ఫుట్ బాల్ కెప్టెన్ అరుదైన రికార్డు
X
  • బాలాదేవికి రేంజర్స్ క్లబ్ కాంట్రాక్టు
  • విదేశీక్లబ్ కాంట్రాక్టు పొందిన భారత తొలిమహిళ

భారత మహిళా ఫుట్ బాల్ కెప్టెన్, డాషింగ్ ఫార్వర్డ్ బాలాదేవీ ఓ అరుదైన ఘనత సంపాదించింది. విదేశీక్లబ్ కాంట్రాక్టు సాధించిన భారత తొలి మహిళా సాకర్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది.

స్కాట్లాండ్ కు చెందిన విశ్వవిఖ్యాత సాకర్ క్లబ్ రేంజర్స్ క్లబ్ తో బాలాదేవి కాంట్రాక్టు కుదుర్చుకొంది. గత నవంబర్ లో జరిగిన సెలెకషన్ ట్రైల్స్ లో పాల్గొన్న బాలాదేవి ఆటతీరుతో సంతృప్తి చెందిన రేంజర్స్ క్లబ్ 18 మాసాల కాంట్రాక్టు కుదుర్చుకొంది.

ఈ ఘనత సాధించిన ఆసియా మహిళా తొలి సాకర్ ప్లేయర్ ఘనతను సైతం …29 సంవత్సరాల బాలా దేవీ దక్కించుకోగలిగింది.

58 మ్యాచ్ ల్లో 52 గోల్స్….

15 సంవత్సరాల వయసులో సాకర్ ఆడుతూ వస్తున్న బాలాదేవి…భారత సీనియర్ జట్టులో సభ్యురాలిగా ఇప్పటి వరకూ ఆడిన 58 గేమ్స్ లో 52 గోల్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది.

భారత దేశవాళీ సాకర్ టోర్నీల్లో 100కు పైగా గోల్స్ తో తనకు తానేసాటిగా నిలిచింది. 2015, 2016 సీజన్లలో భారత అత్యుత్తమ మహిళా ఫుట్ బాలర్ అవార్డులు గెలుచుకొన్న బాలాదేవి…ఓ విదేశీ సాకర్ క్లబ్ కు ఎంపిక కావడంతో మురిసిపోతోంది.

ఈ ఘనత సాధించడం ఓ భారత మహిళగా తనకు గర్వకారణమని బాలాదేవి ప్రకటించింది. భారత మహిళలు సైతం ఫుట్ బాల్ క్రీడలో విదేశీక్లబ్ జట్లకు ఆడగలరని బాలాదేవి చాటి చెప్పింది.

First Published:  30 Jan 2020 3:54 AM IST
Next Story