Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్ లోనే నడాల్ అవుట్

క్వార్టర్ ఫైనల్స్ లో నడాల్ కు థైమ్ షాక్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. టాప్ సీడ్ రాఫెల్ నడాల్ పోటీ…క్వార్టర్ ఫైనల్స్ లోనే ముగిసింది. 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గి రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న 20 టైటిల్స్ రికార్డును సమం చేయాలన్న రఫా ఆశ ఆవిరైపోయింది. మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనా సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన క్వార్టర్ ఫైనల్స్ లో ఆస్ట్ర్రియా ఆటగాడు, 5వ […]

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్ లోనే నడాల్ అవుట్
X
  • క్వార్టర్ ఫైనల్స్ లో నడాల్ కు థైమ్ షాక్

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. టాప్ సీడ్ రాఫెల్ నడాల్ పోటీ…క్వార్టర్ ఫైనల్స్ లోనే ముగిసింది. 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గి రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న 20 టైటిల్స్ రికార్డును సమం చేయాలన్న రఫా ఆశ ఆవిరైపోయింది.

మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనా సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన క్వార్టర్ ఫైనల్స్ లో ఆస్ట్ర్రియా ఆటగాడు, 5వ సీడ్ డోమనిక్ థైమ్ నాలుగుసెట్ల సమరంలో… ప్రపంచ నంబర్ వన్ నడాల్ ను కంగు తినిపించాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో థీమ్ 7-6, 7-6, 4-6, 7-6తో థైమ్ విజేతగా నిలిచాడు. నడాల్ ప్రత్యర్థిగా… గత ఆరేళ్లుగా పరాజయాలు చవిచూస్తూ వస్తున్న థైమ్ ఎట్టకేలకు విజేతగా నిలిచాడు.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ లో జర్మన్ యువఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ తో థీమ్ తలపడనున్నాడు. నడాల్ తో గతంలో ఐదుసార్లు తలపడిన థైమ్ కు.. ఐదుకు ఐదు పరాజయాల రికార్డు ఉంది.

గ్రాండ్ స్లామ్ టోర్నీలో నడాల్ ప్రత్యర్థిగా నడాల్ కు ఇదే తొలిగెలుపు కావడం విశేషం. అంతేకాదు..ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన రెండో ఆస్ట్ర్రియన్ ప్లేయర్ గా థైమ్ రికార్డు నెలకొల్పాడు.. 1997లో థామస్ ముస్టర్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరగా…ఆ తర్వాత అదే ఘనత సాధించిన ఆస్ట్ర్రియన్ ఆటగాడు డోమనిక్ థైమ్ మాత్రమే కావడం విశేషం.

First Published:  30 Jan 2020 3:50 AM IST
Next Story