Telugu Global
Cinema & Entertainment

సిక్స్ ప్యాక్ విలన్ అవుతా

సునీల్ కు విలన్ అవ్వాలనే కోరిక ఇప్పటికి కాదు. నిజానికి అదే ఆశయంతో ఇండస్ట్రీకి వచ్చాడు. కాకపోతే అతడొకటి తలిస్తే విధి మరొకటి తలచింది. అలా విలన్ అవ్వాలనుకున్న వ్యక్తి కాస్తా కమెడియన్ అయిపోయాడు. అయితే హాస్యనటుడిగా మారినా సునీల్ మనసులో కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరింది కూడా. డిస్కోరాజా సినిమాలో విలన్ గా కనిపిస్తాడు సునీల్. సినిమా మొత్తం పాత సునీలే కనిపించినప్పటికీ, క్లైమాక్స్ లో మాత్రం విలన్ సునీల్ […]

sunil
X

సునీల్ కు విలన్ అవ్వాలనే కోరిక ఇప్పటికి కాదు. నిజానికి అదే ఆశయంతో ఇండస్ట్రీకి వచ్చాడు. కాకపోతే అతడొకటి తలిస్తే విధి మరొకటి తలచింది. అలా విలన్ అవ్వాలనుకున్న వ్యక్తి కాస్తా కమెడియన్ అయిపోయాడు. అయితే హాస్యనటుడిగా మారినా సునీల్ మనసులో కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరింది కూడా.

డిస్కోరాజా సినిమాలో విలన్ గా కనిపిస్తాడు సునీల్. సినిమా మొత్తం పాత సునీలే కనిపించినప్పటికీ, క్లైమాక్స్ లో మాత్రం విలన్ సునీల్ అని తెలుస్తుంది. అలా ప్రతినాయకుడిగా మారాడు సునీల్. ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందంటున్నాడు సునీల్. ఇకపై తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సిక్స్ ప్యాక్ విలన్ గా రాణిస్తానని చెబుతున్నాడు.

సునీల్ కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. హీరోగా ఫెయిలైన తర్వాత నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. కమెడియన్ గా చేసిన ప్రయత్నాలేవీ క్లిక్ అవ్వలేదు. చివరికి ఈ విషయంలో స్నేహితుడు త్రివిక్రమ్ కూడా సునీల్ ను ఆదుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు విలన్ గా కూడా మారిన సునీల్, ఈ కొత్త అవతారంలోనైనా మెప్పిస్తాడేమో చూడాలి.

First Published:  29 Jan 2020 2:21 PM IST
Next Story