Telugu Global
NEWS

కివీస్ పై సిరీస్ విజయానికి భారత్ గురి

హామిల్టన్ వేదికగా మరికాసేపట్లో మూడో టీ-20 భారత్-న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ షో….అక్లాండ్ నుంచి హామిల్టన్ కు చేరింది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ నెగ్గడం ద్వారా… విజయాల హ్యాట్రిక్ తో సిరీస్ ను 3-0తో ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. అక్లాండ్ వేదికగా ముగిసిన మొదటి రెండుమ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలతో 2-0తో పైచేయి సాధించిన భారతజట్టు వరుసగా మూడో విజయానికి సిద్ధమయ్యింది. హైస్కోరింగ్ ఫైట్ కు కౌంట్ డౌన్…. పరుగుల గనిగా పేరుపొందిన […]

కివీస్ పై సిరీస్ విజయానికి భారత్ గురి
X
  • హామిల్టన్ వేదికగా మరికాసేపట్లో మూడో టీ-20

భారత్-న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ షో….అక్లాండ్ నుంచి హామిల్టన్ కు చేరింది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ నెగ్గడం ద్వారా… విజయాల హ్యాట్రిక్ తో సిరీస్ ను 3-0తో ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.

అక్లాండ్ వేదికగా ముగిసిన మొదటి రెండుమ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలతో 2-0తో పైచేయి సాధించిన భారతజట్టు వరుసగా మూడో విజయానికి సిద్ధమయ్యింది.

హైస్కోరింగ్ ఫైట్ కు కౌంట్ డౌన్….

పరుగుల గనిగా పేరుపొందిన హామిల్టన్ సెడ్డాన్ పార్క్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. 190కి పైగా స్కోర్లు నమోదు కావడం, చేజింగ్ పరీక్షంగా నిలవడం హామిల్టన్ వేదిక ప్రత్యేకతలుగా గత రికార్డులు చెబుతున్నాయి.

రెండుజట్లూ తుదిజట్టులోకి అదనపు బ్యాట్స్ మన్ కు చోటు కల్పించడం ద్వారా భారీస్కోరుకు గురిపెట్టాయి. ఆతిథ్య న్యూజిలాండ్ కు మాత్రం..ఈమ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే… కివీజట్టు ఈ మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది.

భారత్ టాప్ గేర్…

ఆడిన గత ఐదు టీ-20 మ్యాచ్ ల్లో విజయాలు సాధించిన భారతజట్టు వరుసగా ఆరోవిజయంతో …హ్యాట్రిక్ విజయాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది.

గత 10 ఇన్నింగ్స్ లో ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరు సాధించిన డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీస్కోరు సాధించే అవకాశం లేకపోలేదు.

మరో ఓపెనర్ రాహుల్, కెప్టెన్ కొహ్లీ, నంబర్ ఫోర్ శ్రేయస్ అయ్య్రర్ కళ్లు చెదిరేఫామ్ లో ఉండటంతో భారత బ్యాటింగ్ సమతూకంతో కనిపిస్తోంది.

ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను పక్కనపెట్టి అతని స్థానంలో యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీని తుదిజట్టులోకి తీసుకోవాలన్న ఆలోచన భారత టీమ్ మేనేజ్ మెంట్ లో కనిపిస్తోంది.

గత సిరీస్ లో భాగంగా ఇదే గ్రౌండ్ వేదికగా ముగిసిన టీ-20 మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో నెగ్గిన న్యూజిలాండ్… మరో విజయంతో సిరీస్ ఆశల్ని, అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 190కి పైగా స్కోరు సాధించడం, విజయాన్ని కైవసం చేసుకోడం హామిల్టన్ లో ఆనవాయితీగా వస్తోంది.

విపరీతమైన గాలితో…

బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టే సెడ్డాన్ పార్క్ లో తొలివిజయానికి భారత్ ఆతృతతో ఎదురుచూస్తోంది. వరుస విజయాలతో దూకుడుమీదున్న భారత్ కు న్యూజిలాండ్ సమఉజ్జీగా నిలువగలుగుతుందా? తెలుసుకోవాలంటే మధ్యాహ్నం 12.30కి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసేవరకూ వేచిచూడక తప్పదు.

First Published:  29 Jan 2020 2:06 AM IST
Next Story