Telugu Global
NEWS

ఈ ఇద్ద‌రి మంత్రుల‌ను ఇలా సెట్ చేస్తారా?

ఏపీలో మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ మొద‌లైంది. మండ‌లి ర‌ద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక కేంద్రానికి పంపించ‌డం…పార్ల‌మెంట్ ఆమోదం పొంది….రాష్ట్ర‌ప‌తి సంత‌కం కావడ‌మే మిగిలింది. అయితే ఒక్క‌సారి మండ‌లి ర‌ద్దు పూర్త‌యితే ఎమ్మెల్సీలు ప‌దవులు కోల్పోతారు. ఏపీ శాస‌న‌మండ‌లి మొత్తం స‌భ్యుల సంఖ్య 58. ఇందులో నాలుగు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుత ఎమ్మెల్సీల సంఖ్య 54. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్సీలు 34. వైసీపీకి 9, పీడీఎఫ్‌కి ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మ‌రో ముగ్గురు […]

ఈ ఇద్ద‌రి మంత్రుల‌ను ఇలా సెట్ చేస్తారా?
X

ఏపీలో మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ మొద‌లైంది. మండ‌లి ర‌ద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక కేంద్రానికి పంపించ‌డం…పార్ల‌మెంట్ ఆమోదం పొంది….రాష్ట్ర‌ప‌తి సంత‌కం కావడ‌మే మిగిలింది. అయితే ఒక్క‌సారి మండ‌లి ర‌ద్దు పూర్త‌యితే ఎమ్మెల్సీలు ప‌దవులు కోల్పోతారు.

ఏపీ శాస‌న‌మండ‌లి మొత్తం స‌భ్యుల సంఖ్య 58. ఇందులో నాలుగు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుత ఎమ్మెల్సీల సంఖ్య 54. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్సీలు 34. వైసీపీకి 9, పీడీఎఫ్‌కి ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మ‌రో ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. అయితే మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ పూర్త‌యితే వీరంతా ప‌ద‌వులు కోల్పోతారు.

ఈ ప‌దవులు కోల్పోయే జాబితాలో ఇద్ద‌రు మంత్రులు కూడా ఉన్నారు. వారు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌. వీరి మంత్రి ప‌ద‌వుల‌కు మ‌రో ఆరు నెల‌లు ఢోకా లేదు. చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుడు కాకుండా ఆరునెల‌లు మంత్రిగా ఉండొచ్చు. అంటే మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ ముగిసే వ‌ర‌కూ రెండు నుంచి మూడు నెల‌ల టైమ్ ప‌ట్టొచ్చు. అప్ప‌టి నుంచి ఆరు నెల‌లు అంటే….తొమ్మిది, ప‌ది నెల‌లు గ‌డువు వ‌స్తోంది. అంటే ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కూ వీరి మంత్రి ప‌ద‌వులకు వ‌చ్చిన ప్ర‌మాదం లేదు.

మ‌రోవైపు ఫిబ్ర‌వ‌రి నెల‌లో మండ‌లి ప్ర‌క్రియ పూర్తి అయితే…. మార్చిలో వ‌చ్చే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రిలో ఒక‌రికి లేదా ఇద్ద‌రిని పెద్ద‌ల స‌భ‌కు జ‌గ‌న్ పంపొచ్చు. ఇద్ద‌రూ బీసీ వ‌ర్గానికి చెందిన‌వారే. అంతే కాకుండా జ‌గ‌న్‌తో మొద‌టి నుంచి నడుస్తున్న‌వారే. కేబినెట్ ర్యాంకుతో స‌మాన‌మైన ఏదైనా ప‌ద‌విలో వీరిని కూర్చొబెట్టొచ్చు. లేక‌పోతే కొత్త‌గా ఏర్ప‌డ‌బోయే ప్రాంతీయ మండ‌ళ్లకు వీరిని ఛైర్మ‌న్ లుగా చేయొచ్చు… ఆర్టీసీ ఛైర్మ‌న్ లాంటి కీల‌క మైన ప‌ద‌వులు కూడా ఇచ్చే చాన్స్ ఉంది.

మొత్తానికి ఇద్ద‌రు మంత్రుల‌కు కీల‌క‌మైన ప‌ద‌వులు ఇచ్చేందుకు జ‌గ‌న్ ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది.

First Published:  27 Jan 2020 8:37 PM GMT
Next Story