Telugu Global
NEWS

2020 వైపు ఆ ఐదుగురి చూపు

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పంచరత్నాలు కొత్త సంవత్సరంలో సరికొత్త శిఖరాలు అధిరోహించాలని భారత నవతరం క్రీడాకారులు తహతహలాడుతున్నారు. 2019 సీజన్లో వివిధ క్రీడల్లో తారాజువ్వల్లా దూసుకొచ్చిన యువకెరటాలు సత్యన్, వినేశ్ పోగట్, అమిత్ పంగల్, శ్రేయస్ అయ్యర్, సౌరవ్ చౌదరి..2020 సీజన్లోనూ అదేజోరు కొనసాగించాలన్న లక్ష్యంతో ఉన్నారు. టోక్యో వైపు వినేశ్ చూపు.. ప్రపంచకుస్తీలో ఏదో ఒక పతకం సాధించాలన్న తన జీవితలక్ష్యాన్ని భారత యువవస్తాదు వినేశ్ పోగట్ 2019 ప్రపంచ మహిళా కుస్తీ పోటీల ద్వారా నెరవేర్చుకోగలిగింది. నాలుగో […]

2020 వైపు ఆ ఐదుగురి చూపు
X
  • ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పంచరత్నాలు

కొత్త సంవత్సరంలో సరికొత్త శిఖరాలు అధిరోహించాలని భారత నవతరం క్రీడాకారులు తహతహలాడుతున్నారు. 2019 సీజన్లో వివిధ క్రీడల్లో తారాజువ్వల్లా దూసుకొచ్చిన యువకెరటాలు సత్యన్, వినేశ్ పోగట్, అమిత్ పంగల్, శ్రేయస్ అయ్యర్, సౌరవ్ చౌదరి..2020 సీజన్లోనూ అదేజోరు కొనసాగించాలన్న లక్ష్యంతో ఉన్నారు.

టోక్యో వైపు వినేశ్ చూపు..

ప్రపంచకుస్తీలో ఏదో ఒక పతకం సాధించాలన్న తన జీవితలక్ష్యాన్ని భారత యువవస్తాదు వినేశ్ పోగట్ 2019 ప్రపంచ మహిళా కుస్తీ పోటీల ద్వారా నెరవేర్చుకోగలిగింది.

నాలుగో ప్రయత్నంలో కాంస్య పతకం సాధించడం ద్వారా ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మల్లయోధురాలిగా నిలిచింది. అదృష్టం కూడా కలసి వస్తే 2020 టోక్యో ఒలింపిక్స్ లో సైతం పతకం సాధించాలన్న పట్టుదలతో వినేశ్ సన్నాహాలు ప్రారంభించింది.

భారత టీటీ సంచలనం సత్యన్…

ప్రపంచ టేబుల్ టెన్నిస్ లో అంతంత మాత్రమే గుర్తింపు ఉన్న భారత్ కు ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆటగాడు సత్యన్. పురుషుల సింగిల్స్ లో అత్యుత్తమంగా 24వ ర్యాంక్ సాధించిన భారత తొలి ప్లేయర్ సత్యన్ మాత్రమే.

ప్రపంచ మొదటి 20 ర్యాంకుల్లో నిలిచిన పలువురు ఆటగాళ్లపై సంచలన విజయాలు సాధించడం ద్వారా సత్యన్ తానేమిటో నిరూపించుకొన్నాడు. ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ర్యాంకింగ్స్ లో సైతం భారత్ కు అత్యుత్తమ స్థానం సాధించిపెట్టిన సత్యన్ 2020లో మరింతగా రాణించడం ద్వారా టాప్-10 ర్యాంకుల్లో నిలవాలని కలలు కంటున్నాడు.

షూటింగ్ బుల్లెట్ సౌరవ్ వర్మ…

పిస్టల్ షూటింగ్ లో భారత యువసంచలనం సౌరవ్ వర్మ నిలకడగా రాణిస్తూ 2019లో పతకాల మోత మోగించాడు. టోక్యో ఒలింపిక్స్ కు సైతం నేరుగా అర్హత సంపాదించాడు.

మ్యూనిచ్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ కప్ షూటింగ్ మిక్సిడ్ పెయిర్ విభాగంలో బంగారు పతకం సాధించిన సౌరవ్ అత్యుత్తమ షూటర్ గా నిలిచాడు.

టోక్యో ఒలింపిక్స్ షూటింగ్ వ్యక్తిగత, టీమ్ విభాగాలలో బంగారు పతకాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. మిక్సిడ్ పెయిర్స్ విభాగంలో మను బాకర్ తో కలసి సౌరవ్ ఏదో ఒక పతకం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

అమిత్ పంగల్ గోల్డెన్ పంచ్….

ప్రపంచ జూనియర్ బాక్సింగ్ లో రజత పతకం సాధించిన తొలి భారత బాక్సర్ గా నిలిచిన 23 ఏళ్ల అమిత్ పంగల్.. ఆసియా బాక్సింగ్ 48 కిలోల విభాగంలో సైతం బంగారు పతకం సాధించాడు.

టోక్యో ఒలింపిక్స్ 52 కిలోల విభాగంలో భారత్ కు ప్రాతినిథ్యం వహించనున్న అమిత్ పంగల్ పతకానికి గురిపెట్టాడు.

నంబర్ -4 శ్రేయస్ అయ్యర్…

వన్డే క్రికెట్లో కీలక నంబర్-4 స్థానాన్ని ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ భర్తీ చేయడం ద్వారా… భారత క్రికెట్ చిరకాల లోటును తీర్చగలిగాడు. రెండోడౌన్ ఆటగాడిగా తనకు లభించిన అవకాశాలను విండీస్ తో సిరీస్ ద్వారా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగాడు.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే 2020 ప్రపంచకప్ లో సైతం భారతజట్టుకు సేవలు అందించాలని, మ్యాచ్ విన్నర్ గా నిలవాలని శ్రేయస్ అయ్యర్ కలలు కంటున్నాడు.

న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ-20 సిరీస్ లో సైతం శ్రేయస్ అయ్యర్ తానేమిటో నిరూపించుకొన్నాడు. 2020 సంవత్సరం తమదేనని చాటుకోడానికి ఈ పంచరత్నాలు ఎదురుచూస్తున్నారు.

First Published:  28 Jan 2020 8:46 AM IST
Next Story