Telugu Global
NEWS

మేరీకోమ్, సింధులకు గణతంత్ర పురస్కారాలు

భారత నవతరం అథ్లెట్లకు రాష్ట్ర్రపతి భరోసా భారత 71వ గణతంత్రవేడుకల సందర్భంగా..వివిధ క్రీడలకు చెందిన మొత్తం ఏడుగురు విఖ్యాత అథ్లెట్లకు పద్మపురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బాక్సింగ్ ఎవర్ గ్రీన్ క్వీన్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులకు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రపంచ మహిళా బాక్సింగ్ లో ఆరుసార్లు విశ్వవిజేత, లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత మేరీకోమ్ రాజ్యసభ సభ్యురాలిగా సైతం సేవలు అందిస్తున్నారు. 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ పురస్కారాలు […]

మేరీకోమ్, సింధులకు గణతంత్ర పురస్కారాలు
X
  • భారత నవతరం అథ్లెట్లకు రాష్ట్ర్రపతి భరోసా

భారత 71వ గణతంత్రవేడుకల సందర్భంగా..వివిధ క్రీడలకు చెందిన మొత్తం ఏడుగురు విఖ్యాత అథ్లెట్లకు పద్మపురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బాక్సింగ్ ఎవర్ గ్రీన్ క్వీన్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులకు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రపంచ మహిళా బాక్సింగ్ లో ఆరుసార్లు విశ్వవిజేత, లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత మేరీకోమ్ రాజ్యసభ సభ్యురాలిగా సైతం సేవలు అందిస్తున్నారు.

2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకొన్న మేరీకోమ్ ఇప్పుడు పద్మవిభూషణ్ కు సైతం ఎంపికకావడం విశేషం.

2008లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ లకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేసిన తర్వాత.. ఈ గౌరవం మేరీ కేమ్ కు మాత్రమే దక్కింది.

పీవి సింధుకు పద్మభూషణ్…

రియో ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకం అందించిన తెలుగుతేజం పీవీ సింధు…దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం వద్మభూషణ్ ను అందుకోనుంది.

తన కెరియర్ లో ఇప్పటికే ప్రపంచ టైటిల్ తో పాటు రెండు ప్రపంచ రజత, కాంస్య పతకాలు సాధించిన సింధు..2015లో పద్మశ్రీ పురస్కారం సాధించింది.

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మొత్తం 118 మంది ప్రముఖుల్లో ఆరుగురు క్రీడాకారులు సైతం ఉన్నారు.

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, హాకీ మాజీ ప్లేయర్ గణేశ్, హాకీ మహిళా కెప్టెన్ రాణీ రాంపాల్, భారత మహిళా ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ ఒయినామ్ బెమ్ బెమ్ దేవీ, మాజీ షూటర్ జీతూ రాయ్, ఆర్చర్ తరుణ్ దీప్ రాయ్ పద్మశ్రీలుకానున్నారు.

నవతరం అథ్లెట్లకు భరోసా…

అంతర్జాతీయస్థాయిలో దేశానికి ఖ్యాతి తెస్తున్న నవతరం అథ్లెట్లకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భారత రాష్ట్ర్రపతి రామనాథ్ కోవింద్…తమ గణతంత్ర వేడుకల సందేశంలో హామీ ఇచ్చారు.

మరో ఆరుమాసాలలో జరిగే టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

First Published:  26 Jan 2020 2:50 AM IST
Next Story