Telugu Global
National

సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తాం... ముఖ్యమంత్రులతో హైదరాబాద్‌లో మీటింగ్ పెడతా...

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పాసై చట్టంగా మారి నెల రోజులైంది. ఆనాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పలువురు ముఖ్యమంత్రులు ఆ చట్టాన్ని మా రాష్ట్రాల్లో అమలు చేయమంటూ ప్రకటించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు. పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ సీఏఏకి అనుకూలంగా ఓటువేయకున్నా.. బహిరంగంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఉత్సాహమో.. […]

సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తాం... ముఖ్యమంత్రులతో హైదరాబాద్‌లో మీటింగ్ పెడతా...
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పాసై చట్టంగా మారి నెల రోజులైంది. ఆనాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పలువురు ముఖ్యమంత్రులు ఆ చట్టాన్ని మా రాష్ట్రాల్లో అమలు చేయమంటూ ప్రకటించారు.

కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు. పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ సీఏఏకి అనుకూలంగా ఓటువేయకున్నా.. బహిరంగంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఉత్సాహమో.. ఎన్నికల ముందు అనవసర రాద్దాంతం అని ఆలోచించారో కాని.. సీఎం కేసీఆర్ కీలకమైన సీఏఏపై ఎవరూ ఊహించని ప్రకటన చేశారు. ఏకంగా బీజేపీ ప్రభుత్వాన్ని, అమిత్‌షాను లక్ష్యంగా చేసుకొని పలు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ ఒక దుర్మార్గమైన చట్టమని అన్నారు. దేశంలో ప్రజలను మతం ప్రాతిపదికన విడదీయం…. అది రాజ్యాంగానికి విరుద్దమని ప్రకటించారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టం చాలా దుర్మార్గమైనంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు సమీక్ష చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. దేశమంతా సీఏఏకు వ్యతిరేకంగా అట్టుడికి పోతుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని కేసీఆర్ ప్రశ్నించారు. మేం కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయబోతున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో కూడా క్యాబ్ ప్రవేశపెట్టినప్పుడు అమిత్ షా నాతో మాట్లాడారని కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లును సమర్థించదని ఆనాడే చెప్పానని చెప్పారు.

ఎన్‌పీఆర్‌ను కూడా అమలు చేసేదీ… లేనిది… త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. ఎన్‌ఆర్సీకి తొలి మెట్టు ఎన్ఆర్‌పీ అని చట్టంలోనే ఉన్నదని అన్నారు. దేశంలోని ప్రజలను మతం, జాతి కారణంగా విడదీస్తున్న ఈ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని చెప్పారు. ఇవ్వాళ ముస్లింల దగ్గరకు వచ్చారు.. రేపు మన దగ్గరకు రారని గ్యారెంటీ ఏంటని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

సీఏఏ, ఎన్‌సీఆర్, ఎన్‌పీఆర్‌ల వ్యతిరేకతను సుప్రీంకోర్టు కూడా గుర్తించాలని కేసీఆర్ కోరారు. దీనిని సుమోటోగా తీసుకొని విచారించాలని సీఎం సూచించారు. దేశంలో సీఏఏను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నాయకులతో హైదరాబాద్‌లో మీటింగ్ పెడతానని ఆయన వెల్లడించారు.

ఇప్పటికే చాలా మంది సీఎంలు, పార్టీల నేతలతో సీఏఏ గురించి మాట్లాడానని చెప్పారు. సీఏఏపై గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ అని.. ఎప్పటికీ అదే భావనతో వెళ్తామని అన్నారు. ఇవ్వాళ ముస్లింల వద్దకు వచ్చారు.. రేపు మన దాకా రారని గ్యారెంటీ ఉందా అని ఆయన ప్రశ్నించారు.

First Published:  26 Jan 2020 2:48 AM IST
Next Story