భారత్-న్యూజిలాండ్ సూపర్ సండే టీ-20 ఫైట్
అక్లాండ్ వేదికగానే మరో హైస్కోరింగ్ మ్యాచ్ కు రెడీ ప్రపంచకప్ కు సన్నాహకంగా…న్యూజిలాండ్ తో జరుగుతున్న పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో వరుసగా రెండో విజయానికి 5వ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది. అతిచిన్న బౌండ్రీలైన్లున్న అక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగా ప్రారంభమయ్యే సూపర్ సండే సమరంలో మరోసారి పరుగులు వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే గ్రౌండ్ వేదికగా ముగిసిన తొలిపోటీలో 6 వికెట్ల విజయం సాధించిన భారత్…203 పరుగుల భారీలక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలిఉండ […]
- అక్లాండ్ వేదికగానే మరో హైస్కోరింగ్ మ్యాచ్ కు రెడీ
ప్రపంచకప్ కు సన్నాహకంగా…న్యూజిలాండ్ తో జరుగుతున్న పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో వరుసగా రెండో విజయానికి 5వ ర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది.
అతిచిన్న బౌండ్రీలైన్లున్న అక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగా ప్రారంభమయ్యే సూపర్ సండే సమరంలో మరోసారి పరుగులు వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదే గ్రౌండ్ వేదికగా ముగిసిన తొలిపోటీలో 6 వికెట్ల విజయం సాధించిన భారత్…203 పరుగుల భారీలక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలిఉండ గానే సాధించడం ద్వారా తన బ్యాటింగ్ పవర్ ఏపాటిదో ప్రత్యర్థికి తెలియచెప్పింది.
కుల్దీప్ వైపు భారత్ చూపు…
మొదటి మ్యాచ్ లో ముగ్గురు పేసర్లు, ఇద్దరుస్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగిన భారత్… పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ శివం దూబేను పక్కనపెట్టి.. తుదిజట్టులోకి లెఫ్టామ్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది.
బ్యాటింగ్ లో డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సైతం తనవంతుగా భారీస్కోరు కోసం ఎదురుచూస్తున్నాడు. యువఓపెనర్ రాహుల్, కెప్టెన్ కొహ్లీ, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కళ్లు చెదిరే ఫామ్ లో ఉండటం, మనీశ్ పాండే సైతం పరిస్థితులకు అనుగుణంగా ఆడటంతో భారత బ్యాటింగ్ లైనప్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది.
కివీలపైనే ఒత్తిడి….
మరో వైపు ఆతిథ్య న్యూజిలాండ్ తీవ్రఒత్తిడి నడుమ బరిలోకి దిగుతోంది. తొలిటీ-20లో 203 పరుగుల భారీస్కోరు సాధించినా… ఓటమి పొందడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.
బౌలింగ్ విభాగంలో మరింత దూకుడుగా వ్యవహరించగలిగితేనే పవర్ ఫుల్ భారత బ్యాటింగ్ ఆర్డర్ కు పగ్గాలు వేయగలమని కివీ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ గట్టిగా నమ్ముతున్నాడు. ఓపెనర్ గప్టిల్, కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, మాజీ కెప్టెన్ రోజ్ టేలర్, కోలిన్ మున్రో హాఫ్ సెంచరీల సాధించిన జోరునే రెండోమ్యాచ్ లోనూ కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు.
4-2 రికార్డుతో న్యూజిలాండ్…
భారత్ ప్రత్యర్థిగా స్వదేశీగడ్డపై ఇప్పటి వరకూ ఆడిన ఆరు టీ-20 మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ నాలుగు విజయాలు సాధిస్తే…భారత్ రెండు మ్యాచ్ లు మాత్రమే నెగ్గగలిగింది.
2019 సిరీస్ లో భాగంగా జరిగిన టీ-20 సమరంలోనూ న్యూజిలాండ్ జట్టే 2-1తో విజేతగా నిలువగలిగింది. అయితే..భారత్ సాధించిన రెండు విజయాలు.. అక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగానే నమోదు కావడం విశేషం.
మరికాసేపట్లో ప్రారంభమయ్యే రెండో టీ-20లోనూ భారత జోరే కొనసాగుతుందా?…లేక న్యూజిలాండ్ మ్యాచ్ నెగ్గి సిరీస్ లో 1-1తో సమఉజ్జీగా నిలుస్తుందా?… తెలుసు కోవాలంటే మరికొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.
భారత కాలమానప్రకారం మధ్యాహ్నం 12 గంటల 30నిముషాలకు ఈ కీలక సమరం ప్రారంభంకానుంది.