భారత మహిళల చేజారిన ఒలింపిక్స్ బెర్త్
ఫాన్స్ తో పోరాడి ఓడిన భారతజట్టు జపాన్ రాజధాని టోక్యో వేదికగా మరో ఆరుమాసాలలో ప్రారంభంకానున్న 2020 ఒలింపిక్స్ మహిళల టీమ్ విభాగంలో పాల్గొనటానికి…23వ ర్యాంక్ భారతజట్టు అర్హత సాధించలేకపోయింది. పోర్చుగల్ లోని గోండోమార్ వేదికగా జరిగిన మహిళల టీమ్ అర్హత పోటీలలో 24వ ర్యాంకర్ ఫ్రాన్స్ చేతిలో భారత్ 3-2తో పరాజయం పాలయ్యింది. భారత స్టార్ ప్లేయర్, ప్రపంచ 61వ ర్యాంకర్ మోనికా బాత్రా సింగిల్స్ లో ఓ మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ లో ఓడగా..డబుల్స్ […]
- ఫాన్స్ తో పోరాడి ఓడిన భారతజట్టు
జపాన్ రాజధాని టోక్యో వేదికగా మరో ఆరుమాసాలలో ప్రారంభంకానున్న 2020 ఒలింపిక్స్ మహిళల టీమ్ విభాగంలో పాల్గొనటానికి…23వ ర్యాంక్ భారతజట్టు అర్హత సాధించలేకపోయింది.
పోర్చుగల్ లోని గోండోమార్ వేదికగా జరిగిన మహిళల టీమ్ అర్హత పోటీలలో 24వ ర్యాంకర్ ఫ్రాన్స్ చేతిలో భారత్ 3-2తో పరాజయం పాలయ్యింది.
భారత స్టార్ ప్లేయర్, ప్రపంచ 61వ ర్యాంకర్ మోనికా బాత్రా సింగిల్స్ లో ఓ మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ లో ఓడగా..డబుల్స్ లో భారతజోడీ ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ విజయం సాధించడం ద్వారా 2-2తో ఫ్రాన్స్ తో సమఉజ్జీగా నిలిపారు.
నిర్ణయాత్మక ఆఖరి సింగిల్స్ పోటీలో ఐహిక పైన ఫ్రెంచ్ ప్లేయర్ మేరీ 6-11, 11-8, 11-5, 11-9, 11-9తో సంచలన విజయం సాధించడం ద్వారా తనజట్టుకు టోక్యో బెర్త్ ఖాయం చేయగలిగింది.
ప్రీ క్వార్టర్ ఫైనల్లో రుమేనియా చేతిలో 2-3తో పరాజయం పొందిన భారత్ కు ప్లేఆఫ్ మ్యాచ్ లో సైతం ఫ్రాన్స్ చేతిలో ఓటమి తప్పలేదు.
సింగిల్స్ అవకాశాలు సజీవం..
మహిళల టీమ్ విభాగంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన భారత కు మహిళల సింగిల్స్ లో మాత్రం రెండు బెర్త్ లు సాధించే అవకాశం ఉంది.
థాయ్ లాండ్ వేదికగా ఏప్రిల్ లో జరిగే మహిళల సింగిల్స్ అర్హత పోటీలలో భారత్ తరపున మోనికా బాత్రా, అర్చనా కామత్ తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.