జూనియర్ ప్రపంచకప్ క్వార్టర్స్ లో భారత్
లీగ్ ఆఖరిపోటీలో న్యూజిలాండ్ పై విజయం సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 జూనియర్ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ దూసుకెళ్లింది. బ్లూమ్ ఫాంటెయిన్ వేదికగా ముగిసిన గ్రూప్-ఏ ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో భారత్ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసి టాపర్ గా నిలిచింది. వర్షంతో 23 ఓవర్లకు కుదించిన ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 115 పరుగుల […]
- లీగ్ ఆఖరిపోటీలో న్యూజిలాండ్ పై విజయం
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 జూనియర్ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ దూసుకెళ్లింది. బ్లూమ్ ఫాంటెయిన్ వేదికగా ముగిసిన గ్రూప్-ఏ ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో భారత్ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసి టాపర్ గా నిలిచింది.
వర్షంతో 23 ఓవర్లకు కుదించిన ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 115 పరుగుల స్కోరు సాధించింది.
భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 57, దివ్యాంశు సక్సేనా 52 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు.
డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం 23 ఓవర్లలో 192 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ 21 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే సాధించగలిగింది. భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ 5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు, లెఫ్టామ్ స్పిన్నర్ అన్ కోల్కేర్ 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు.
గ్రూప్ – ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో శ్రీలంకను 90 పరుగుల తేడాతోను, రెండోమ్యాచ్ లో జపాన్ ను 10 వికెట్ల తేడాతోనూ చిత్తు చేసిన భారత్.. న్యూజిలాండ్ పై 44 పరుగుల విజయం ద్వారా …. గ్రూపు మూడుకు మూడురౌండ్లు నెగ్గి టాపర్ గా క్వార్టర్ ఫైనల్స్ సూపర్ లీగ్ రౌండ్లో అడుగుపెట్టింది.
క్వార్టర్ ఫైనల్స్ లో గత టోర్నీ రన్నరప్ ఆస్ట్ర్రేలియాతో భారత్ తలపడనుంది. జనవరి 28న ఈ కీలకసమరం జరుగనుంది.