మున్సిపల్ ఫలితాలపై... హరీష్, రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యాన్ని.. ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దాదాపు 90 శాతం స్థానాలను సొంతం చేసుకుని.. తిరుగులేని రాజకీయ శక్తిగా తన శక్తి సామర్థ్యాలు ఏంటో మరోసారి చాటింది. ఈ నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.. ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు… ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ […]
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యాన్ని.. ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దాదాపు 90 శాతం స్థానాలను సొంతం చేసుకుని.. తిరుగులేని రాజకీయ శక్తిగా తన శక్తి సామర్థ్యాలు ఏంటో మరోసారి చాటింది. ఈ నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.. ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు… ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దే అని ప్రజలు నిరూపించారు.. అంటూ ట్వీట్ చేయడమే కాక.. కేడర్ ను అభినందించి ఉత్సాహపరిచారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ ఆయన అభినందించడాన్ని.. చాలా మంది ఆసక్తిగా గమనించారు.
ఇటు.. కాంగ్రెస్ లో మాత్రం పూర్తి నిస్తేజం నెలకొంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ పరాజయాన్ని లైట్ తీసుకున్నారు. ఫలితాలు చూసి కొందరు పొంగిపోతారని.. తాము అలా కాదని.. ఎలాంటి ఫలితాన్ని అయినా తట్టుకుంటామని అన్నారు. మంత్రులు తమ అభ్యర్థులను బెదిరించిన కారణంగానే.. ఫలితాలు ఇలా వచ్చాయని ఆరోపించారు.
అటు.. టీఆర్ఎస్ కు ఇంతటి విజయం దక్కడంపై.. టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషించారు. సంక్షేమ పథకాల కారణంగానే.. గెలిచామని చెప్పారు.