Telugu Global
NEWS

అయ్యారే!...భారత్ భలే గెలుపు

అక్లాండ్ టీ-20లో సూపర్ చేజింగ్ విన్ న్యూజిలాండ్ లో 6 వారాల పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. ప్రపంచకప్ కు సన్నాహకంగా న్యూజిలాండ్ తో ఆడుతున్న 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ లో సూపర్ చేజింగ్ విజయంతో బోణీ కొట్టింది. బ్యాట్స్ మన్ స్వర్గధామం ఈడెన్ పార్క్ వేదికగా ముగిసిన హైస్కోరింగ్ తొలి టీ-20మ్యాచ్ ను భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లతో నెగ్గి 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ లో టాస్ […]

అయ్యారే!...భారత్ భలే గెలుపు
X
  • అక్లాండ్ టీ-20లో సూపర్ చేజింగ్ విన్

న్యూజిలాండ్ లో 6 వారాల పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. ప్రపంచకప్ కు సన్నాహకంగా న్యూజిలాండ్ తో ఆడుతున్న 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ లో సూపర్ చేజింగ్ విజయంతో బోణీ కొట్టింది.

బ్యాట్స్ మన్ స్వర్గధామం ఈడెన్ పార్క్ వేదికగా ముగిసిన హైస్కోరింగ్ తొలి టీ-20మ్యాచ్ ను భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లతో నెగ్గి 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ మున్రో, కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, మాజీ కెప్టెన్ రోజ్ టేలర్ హాఫ్ సెంచరీలు సాధించారు.

రాహుల్- అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీలు…

204 పరుగుల భారీ టార్గెట్ తో చేజంగ్ కు దిగిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే రోహిత్ శర్మ వికెట్ నష్టపోయినా …రాహుల్- కొహ్లీ రెండో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు. మొదటి 9 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు సాధించడం ద్వారా కివీస్ పై ఒత్తిడి పెంచింది.

రాహుల్ కేవలం 23 బాల్స్ లోనే స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించి అవుటయ్యాడు. అ వెంటనే కొహ్లీ సైతం వెనుదిరగడంతో భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు నష్టపోయింది. ఆల్ రౌండర్ శివం దూబే సైతం తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో..భారత్ గెలుపు భారం శ్రేయస్ అయ్యర్ పైన పడింది.

అయ్యర్ 28 బాల్స్ లో 5 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 58 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా భారత్ ను 19 ఓవర్లలోనే విజేతగా నిలిపాడు.

శ్రేయస్ అయ్యర్ కెరియర్ లో ఇది రెండో టీ-20 హాఫ్ సెంచరీ కాగా…ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

6 మ్యాచ్ ల్లో రెండోగెలుపు…

న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఆడిన మొత్తం ఆరు టీ-20 మ్యాచ్ ల్లో భారత్ కు ఇది రెండోగెలుపు మాత్రమే. అక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగా ఆడిన రెండుకు రెండు టీ-20ల్లోనూ భారతజట్టే విజేతగా నిలిచింది. ప్రస్తుత సిరీస్ లోని రెండోమ్యాచ్ సైతం సూపర్ సండే ఫైట్ గా ఈడెన్ పార్క్ వేదికగా జరుగనుంది.

First Published:  25 Jan 2020 4:30 AM IST
Next Story