Telugu Global
NEWS

బీసీసీఐ సెలెక్టర్ల రేస్ లో ముగ్గురు మొనగాళ్లు

మూడు స్థానాలకు ఐదుగురు పోటీ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు సీనియర్ సెలెక్షన్ కమిటీలో చోటు కోసం మాజీ క్రికెటర్ల మధ్య పోటీ హాటుహాటుగా మారింది. ఏడాదికి 80 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ వేతనం ఉండే సెలెక్టర్ల పదవి కత్తిమీద సాములాంటిదే. భారత క్రికెట్ సంఘం పరిథిలోని మొత్తం ఐదుజోన్ల నుంచి ఒక్కో సెలెక్టర్ చొప్పున మొత్తం ఐదుగురు సభ్యుల ఎంపిక సంఘాన్ని నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత బీసీసీఐ సీనియర్ […]

బీసీసీఐ సెలెక్టర్ల రేస్ లో ముగ్గురు మొనగాళ్లు
X
  • మూడు స్థానాలకు ఐదుగురు పోటీ

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు సీనియర్ సెలెక్షన్ కమిటీలో చోటు కోసం మాజీ క్రికెటర్ల మధ్య పోటీ హాటుహాటుగా మారింది.

ఏడాదికి 80 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ వేతనం ఉండే సెలెక్టర్ల పదవి కత్తిమీద సాములాంటిదే.
భారత క్రికెట్ సంఘం పరిథిలోని మొత్తం ఐదుజోన్ల నుంచి ఒక్కో సెలెక్టర్ చొప్పున మొత్తం ఐదుగురు సభ్యుల ఎంపిక సంఘాన్ని నియమించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రస్తుత బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీకి సౌత్ జోన్ కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వం వహిస్తున్నారు. సెంట్రల్ జోన్ కు చెందిన గగన్ ఖోడా, నార్త్ జో్న్ కు చెందిన శరణ్ దీప్ సింగ్, వెస్ట్ జోన్ కు చెందిన జతిన్ పరంజపే, ఈస్ట్ జోన్ కు చెందిన దేవాంగ్ గాంధీ ఇతర సెలెక్టర్లుగా ఉన్నారు.

వీరిలో …ఎమ్మెస్కే ప్రసాద్, జతిన్ పరంజపేల నాలుగేళ్ల పదవీకాలం ముగిసిపోడంతో… రెండు ఖాళీలను భర్తీ చేయటానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

రిటైరై 5 సంవత్సరాలై ఉండాలని, భారతజట్టుకు సీనియర్ స్థాయిలో ప్రాతినిథ్యం వహించితీరి ఉండాలని షరతులు విధించింది.

ఏడుగురి దరఖాస్తులు…

సెలెక్షన్ కమిటీలోని రెండు ఖాళీల కోసం దేశంలోని వివిధ జోన్లకు చెందిన ఐదుగురు సెలెక్టర్లు పోటీపడుతున్నారు. దరఖాస్తులు పంపుకోడానికి జనవరి 24 ఆఖరిరోజు కావడంతో…మాజీ లెగ్ స్పిన్నర్, ప్రస్తుత కామెంటీటర్ ఎల్. శివరామకృష్ణన్, మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్, అమ్యా ఖురాసియా, మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్, సంజయ్ బంగర్, జ్ఞానేంద్ర పాండే సైతం రేస్ లో నిలిచినట్లు ప్రకటించారు.

సౌత్ జోన్ స్థానం కోసం దరఖాస్తు పంపిన శివరామకృష్ణన్ గత 20 సంవత్సరాలుగా విఖ్యాత కామెంటీటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీలో స్పిన్ బౌలింగ్ శిక్షకుడిగా సేవలు అందిస్తున్నారు.

54 సంవత్సరాల శివరామకృష్ణన్ కు 9 టెస్టులు, 16 వన్డేలు ఆడిన అనుభవం ఉంది. ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కు 33 టెస్టులు, 161 వన్డేలు ఆడిన రికార్డుతో పాటు జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా రెండున్నర సంవత్సరాల అనుభవం ఉంది.

సంజయ్ బంగర్ కు 12 టెస్టులు, 15 వన్డేలు ఆడిన రికార్డు, మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేశ్ చౌహాన్ కు 21 టెస్టులు, 35 వన్డేలు ఆడిన రికార్డులు ఉన్నాయి. ఈ ఏడుగురిలో ఏ ఇద్దరిని సెలెక్టర్ పదవులు వరిస్తాయన్నదే ఇక్కడి ఇసలు పాయింటు.

First Published:  24 Jan 2020 5:36 AM IST
Next Story