Telugu Global
NEWS

ఖేలో ఇండియా 2020 విజేత మహారాష్ట్ర్ర

పతకాల పట్టిక అట్టడుగున తెలుగు రాష్ట్ర్రాలు ఖేలో ఇండియా 2020 గేమ్స్ ఓవరాల్ చాంపియన్షిప్ ను మహారాష్ట్ర్ర నిలబెట్టుకొంది. అసోంలోని గౌహతీ వేదికగా గత 13 రోజులుగా జరిగిన ఈ యువజన క్రీడా సంరంభంలో మరోసారి మహారాష్ట్ర్ర తన ఆధిక్యాన్ని చాటుకొంది. మహారాష్ట్ర్ర యువక్రీడాకారులు 78 స్వర్ణాలతో సహా మొత్తం 256 పతకాలతో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. హర్యానా మొత్తం 200 పతకాలతో రెండోస్థానంతో సరిపెట్టుకొంది. అండర్ -17 బాలికల ఈతలో మహారాష్ట్ర్ర స్విమ్మర్ కరీనా షంక్తా రెండో […]

ఖేలో ఇండియా 2020 విజేత మహారాష్ట్ర్ర
X
  • పతకాల పట్టిక అట్టడుగున తెలుగు రాష్ట్ర్రాలు

ఖేలో ఇండియా 2020 గేమ్స్ ఓవరాల్ చాంపియన్షిప్ ను మహారాష్ట్ర్ర నిలబెట్టుకొంది. అసోంలోని గౌహతీ వేదికగా గత 13 రోజులుగా జరిగిన ఈ యువజన క్రీడా సంరంభంలో మరోసారి మహారాష్ట్ర్ర తన ఆధిక్యాన్ని చాటుకొంది.

మహారాష్ట్ర్ర యువక్రీడాకారులు 78 స్వర్ణాలతో సహా మొత్తం 256 పతకాలతో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. హర్యానా మొత్తం 200 పతకాలతో రెండోస్థానంతో సరిపెట్టుకొంది.

అండర్ -17 బాలికల ఈతలో మహారాష్ట్ర్ర స్విమ్మర్ కరీనా షంక్తా రెండో స్వర్ణం సాధించింది.మహారాష్ట్ర్ర ఖేలో ఇండియా ఓవరాల్ విజేతగా నిలవడం వరుసగా ఇది రెండోసారి.

మహారాష్ట్ర్ర మొత్తం 78 స్వర్ణ, 77 రజత, 101 కాంస్యపతకాలు సాధించింది. ఢిల్లీ మూడు, కర్నాటక నాలుగు, ఉత్తరప్రదేశ్ ఐదుస్థానాలలో నిలిచాయి. ఆతిథ్య అసోం ఏడోస్థానం దక్కించుకొంది.

తెలుగు రాష్ట్ర్రాల వెలవెల

మొత్తం 28 రాష్ట్ర్రాలు పతకాల పట్టికలో చోటు సంపాదించగా… తెలుగు రాష్ట్ర్రాలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ దొందు దొందే అనిపించుకొన్నాయి. తెలంగాణా 7 స్వర్ణాలతో సహా 21 పతకాలతో 15వ స్థానంలో నిలిచింది.

ఇక…ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మూడు స్వర్ణాలతో సహా మొత్తం 17 పతకాలతో 22వ స్థానానికి దిగజారిపోయింది.

First Published:  23 Jan 2020 6:04 AM IST
Next Story