Telugu Global
Cinema & Entertainment

డిస్కోరాజాకు రిలీజ్ కు ముందే దెబ్బ

రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాకు రిలీజ్ కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సంతృప్తికర స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల్ని ఇంకా థియేటర్లలో కొనసాగిస్తున్నారు. దీంతో డిస్కోరాజాకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. రేపు చాలా తక్కువ థియేటర్లలో (ఏపీ, నైజాం కలిపి 250లోపే) రిలీజ్ అవుతోంది ఈ సినిమా. నిజానికి సంక్రాంతి సినిమాల్లో ఏదో ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం […]

డిస్కోరాజాకు రిలీజ్ కు ముందే దెబ్బ
X

రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాకు రిలీజ్ కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సంతృప్తికర స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల్ని ఇంకా థియేటర్లలో కొనసాగిస్తున్నారు. దీంతో డిస్కోరాజాకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. రేపు చాలా తక్కువ థియేటర్లలో (ఏపీ, నైజాం కలిపి 250లోపే) రిలీజ్ అవుతోంది ఈ సినిమా.

నిజానికి సంక్రాంతి సినిమాల్లో ఏదో ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం ఆనవాయితీ. గడిచిన ఐదేళ్లుగా ఇలానే జరుగుతోంది. భారీ ఎత్తున విడుదలైన సినిమాల్లో ఏదో ఒకటి దుకాణం సర్దేస్తోంది. అదే నమ్మకంతో రవితేజ సంక్రాంతి తర్వాత రావడానికి రెడీ అయ్యాడు. కానీ అతడి అంచనా తలకిందులైంది. ఎంత మంచివాడవురా సినిమాను మినహాయిస్తే.. మహేష్, బన్నీ, రజనీకాంత్ సినిమాలు మూడూ క్లిక్ అవ్వడంతో రవితేజకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది.

మరీ ముఖ్యంగా బన్నీ-మహేష్ మధ్య ప్రస్తుతం భారీ ఎత్తున పోటీ నడుస్తున్న నేపథ్యంలో వాళ్లు తమ సినిమాను ఏ ఒక్క థియేటర్ నుంచి తీసేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది వాళ్లకు ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి.

దీంతో డిస్కోరాజా సినిమాకు థియేటర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం దర్బార్, ఎంత మంచివాడవురా డిస్ట్రిబ్యూటర్లతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నాడు నిర్మాత రామ్ తళ్లూరి. ఎంత మంచివాడవురా సినిమాను తప్పించడానికి నందమూరి ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. సో.. దర్బార్ నుంచి కొన్ని థియేటర్లు డిస్కోరాజాకు వచ్చే ఛాన్స్ ఉంది. అలా జరిగినా కూడా డిస్కోరాజాకు స్క్రీన్ కౌంట్ తక్కువే.

First Published:  23 Jan 2020 6:46 AM IST
Next Story