Telugu Global
NEWS

ఇన్ సైడర్ ట్రేడింగ్... భూముల కొనుగోలుదారులపై సీఐడీ కేసు నమోదు

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డ 796 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొంతమంది ఎకరం భూమి రూ.3 కోట్లకు చొప్పున కొనుగోలు చేసినట్లుగా పక్కాగా సీఐడీ పూర్తి ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అందులో భాగంగానే వీరిపై కేసునమోదు చేశారని చెబుతున్నారు. తెల్లరేషన్‌ కార్డు దారులు దాదాపు రూ.300 కోట్లతో అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. వీరితో భూములు కొనుగోలు చేయించిన వారి వివరాలు విచారణలో తేలనున్నాయి. భూములు కొనుగోలు […]

ఇన్ సైడర్ ట్రేడింగ్... భూముల కొనుగోలుదారులపై సీఐడీ కేసు నమోదు
X

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డ 796 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొంతమంది ఎకరం భూమి రూ.3 కోట్లకు చొప్పున కొనుగోలు చేసినట్లుగా పక్కాగా సీఐడీ పూర్తి ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అందులో భాగంగానే వీరిపై కేసునమోదు చేశారని చెబుతున్నారు.

తెల్లరేషన్‌ కార్డు దారులు దాదాపు రూ.300 కోట్లతో అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. వీరితో భూములు కొనుగోలు చేయించిన వారి వివరాలు విచారణలో తేలనున్నాయి.

భూములు కొనుగోలు చేసిన తెల్లరేషన్‌ కార్డు దారులలో 43 మంది పెద్దకాకానిలో 40 ఎకరాలు కొనుగోలు చేశారు. 148 మంది మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలు చేసినట్లు కనుక్కున్నారు. తుళ్లూరులో 243 ఎకరాలను 238 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 188 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ తాడికొండలో 180 ఎకరాలు కొన్నట్లు ఆధారాలు లభించాయి.

మరో 43 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్నట్లు, మరో 49 మంది తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్నట్లు సీఐడీ బృందాలు గుర్తించాయి. ఈ విచారణ కోసం సీఐడీ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది.

First Published:  23 Jan 2020 6:34 AM IST
Next Story