Telugu Global
National

సీఏఏపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ.... రాజ్యాంగ ధర్మాసనానికి పిటీషన్లు

దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్న పౌరసత్వసవరణ చట్టం (సీఏఏ) అమలు పై సుప్రీం కోర్టు తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కేంద్రంలోని బీజేపీకి ఊరట లభించింది.  కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం పిటీషన్ లతోపాటు దాదాపు 140మంది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్ లను సుప్రీం కోర్టు బుధవారం విచారించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన […]

సీఏఏపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ.... రాజ్యాంగ ధర్మాసనానికి పిటీషన్లు
X

దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్న పౌరసత్వసవరణ చట్టం (సీఏఏ) అమలు పై సుప్రీం కోర్టు తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కేంద్రంలోని బీజేపీకి ఊరట లభించింది.

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం పిటీషన్ లతోపాటు దాదాపు 140మంది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్ లను సుప్రీం కోర్టు బుధవారం విచారించింది.

చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ వీటిని విచారించింది. సీఏఏ రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని.. రాజ్యాంగ విరుద్ధమని.. సమానత్వ హక్కులకు విరుద్ధంగా ఉందని మతప్రాతిపదికన చట్టాన్ని రూపొందించారని.. వెంటనే ఈ బిల్లుపై స్టే ఇవ్వాలని పిటీషనర్లు కోరారు.

ప్రభుత్వం తరుఫున వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమని సుప్రీం కోర్టు తాజా తీర్పులో వెల్లడించింది. ఈ పిటీషన్ లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటీషన్ దారులంతా రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లాలని సూచించింది.

First Published:  22 Jan 2020 9:20 AM IST
Next Story