Telugu Global
NEWS

ఆరు నెలల్లో జగన్ ఏంటో తెలిసిందా?

ఏపీకి మూడు రాజధానులుంటే తప్పేంటి?… ఇది జగన్ అసెంబ్లీ సాక్షిగా అన్న మాట… ఇప్పుడంత అవసరమేంటి?…అంటూ రాజధాని రైతుల సాక్షిగా చంద్రబాబు ఆందోళనతో అన్న మాట. అమ‌రావ‌తి ఇష్యూని జ‌గ‌న్ ఎలా హ్యాండిల్ చేస్తారో అని ఆ పార్టీలో కొంతమంది కంగారు ప‌డ్డారు. కానీ అమ‌రావ‌తిపై చర్చ‌లో జ‌గ‌న్ చూపిన సంయ‌మ‌నం, మాట్లాడిన తీరుతో ఇప్పుడు అంతా చ‌ల్లాబ‌డ్డారు. జ‌గ‌న్ బ్యాలెన్స్‌గా వ్య‌వ‌హ‌రించి…త‌మ‌కు రైతులు ముఖ్య‌మ‌ని..తాను అంద‌రూ ఓట్లు వేస్తే గెలిచాన‌ని చెప్పారు. రైతు ప‌క్ష‌పాతిగా మ‌రోసారి […]

ఆరు నెలల్లో జగన్ ఏంటో తెలిసిందా?
X
  • ఏపీకి మూడు రాజధానులుంటే తప్పేంటి?… ఇది జగన్ అసెంబ్లీ సాక్షిగా అన్న మాట…
  • ఇప్పుడంత అవసరమేంటి?…అంటూ రాజధాని రైతుల సాక్షిగా చంద్రబాబు ఆందోళనతో అన్న మాట.

అమ‌రావ‌తి ఇష్యూని జ‌గ‌న్ ఎలా హ్యాండిల్ చేస్తారో అని ఆ పార్టీలో కొంతమంది కంగారు ప‌డ్డారు. కానీ అమ‌రావ‌తిపై చర్చ‌లో జ‌గ‌న్ చూపిన సంయ‌మ‌నం, మాట్లాడిన తీరుతో ఇప్పుడు అంతా చ‌ల్లాబ‌డ్డారు. జ‌గ‌న్ బ్యాలెన్స్‌గా వ్య‌వ‌హ‌రించి…త‌మ‌కు రైతులు ముఖ్య‌మ‌ని..తాను అంద‌రూ ఓట్లు వేస్తే గెలిచాన‌ని చెప్పారు.

రైతు ప‌క్ష‌పాతిగా మ‌రోసారి అమ‌రావ‌తి రైతుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ఇప్పుడు ఇస్తున్న కౌలు ప‌దేళ్ల నుంచి ప‌దిహేన‌ళ్ల‌కు పెంచారు. భూమిలేనివారికి ఇస్తున్న పెన్ష‌న్ 2500 నుంచి ఐదువేల‌కు తీసుకెళ్లారు.

అంతేకాకుండా అమ‌రావ‌తి ఎందుకు నిర్మించలేక‌పోతున్నామో జ‌గ‌న్ వివ‌రించారు. చంద్ర‌బాబు చూపిన గ్రాఫిక్స్‌, భ్ర‌మ‌లను తాను కూడా ఫాలో అవ్వ‌లేన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసే మ‌న‌స్త‌త్వం తనది కాద‌ని సూటిగా చెప్పారు.

అసెంబ్లీ స‌మావేశాలు చూసిన త‌ర్వాత జ‌గ‌న్ కంగారు ప‌డ‌కుండా మొదటి టాస్క్ పూర్తి చేశారు. కానీ మూడు రాజధానుల అంశంపై మొదట్నుంచీ విమర్శిస్తూ వచ్చిన 40ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఎందుకు ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ వ్యూహం చెడింది. పిల్లవాడు జగన్ అంటూ అవహేళన చేసిన చంద్రబాబు ఎందుకు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు…జగన్ ఎందుకు అంత పక్కాగా సక్సెస్ అయ్యాడు…అన్నది చూస్తే…

పాలన పగ్గాలు చేపట్టాక ఓ వైపు నవరత్నాలు అమలు చేస్తూనే…మరోవైపు ప్రతిపక్షం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ వాటిని సరిదిద్దుతామంటూ ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు సీఎం జగన్. అక్కడ నుంచి జగన్ సీఎంగా పక్కావ్యూహాలతో అడుగులు వేస్తూ…. విపక్షాల విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇస్తూ తనేమి అనుకుంటున్నారో అది చేసుకుపోయారు. చంద్రబాబు ఎత్తులను సైతం చిత్తు చేస్తూ రాజధాని అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు.

మూడు రాజధానులు చేస్తే తప్పేంటి అంటూ ఓ ఫీలర్ ను వదిలారు. దీనిపై రాష్ట్రం నుంచి , అలాగే రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూశారు. అసెంబ్లీలో వదిలిన రాజధాని బాణం కేవలం అమరావతిలోని కొన్ని గ్రామాల‌కు మాత్ర‌మే తాకింది. అక్కడే కాస్త మంట పుట్టింది. మిగతా చోట్ల ఎక్కడా అంత వ్యతిరేకత రాలేదు.

బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ…. తర్వాత ఏపీ కేబినెట్..తర్వాత అసెంబ్లీలో చర్చ…. ఇలా ప్రతి ఒక్కటీ చాలా వ్యూహాత్మకంగా…. అత్యంత వేగంగా తతంగాన్ని నడిపారు. కేవలం రాజధాని సమస్యను అమరావతికే పరిమితం చేయండంలో జగన్ వ్యూహం ఫలించిందనే చెప్పవచ్చు.

మరోవైపు చంద్రబాబు రాజధాని తరలింపు అంశాన్ని రాష్ట్ర సమస్యగా మార్చడంలో విఫలమయ్యారు. కేవలం రాజధాని గ్రామాల్లోనే ఆ ఆందోళన పరిమతం కావడంతో…మిగతా జిల్లాల్లో వ్యతిరేకత రాకపోవడంతో చంద్రబాబు వ్యూహాలు పనిచేయలేదు.

అందుకే చంద్రబాబు ఎన్ని చెబుతున్నా… జోలె పట్టుకుని తిరుగుతున్నా… రాష్ట్రంలో పెద్దగా స్పందన రాలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించిన వైసీపీ సర్కార్…తన పనిని పక్కాగా కానిచ్చేసింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ప‌రిశీలించిన త‌ర్వాత ఆరునెలల్లో జ‌గ‌న్ ఏంటో టీడీపీ నేత‌ల‌కు బాగా అర్ధ‌మైందని అంటున్నారు.

First Published:  21 Jan 2020 6:29 AM IST
Next Story