Telugu Global
NEWS

టీడీపీ గుండెల్లో.... వల్లభనేని వంశీ గునపాలు

వల్లభనేని వంశీ. ఈ పేరు చెబితే చాలు… తెలుగుదేశం నేతలు చికాకు పడే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఇటీవలే అధినేత చంద్రబాబును చీల్చి చెండాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపించడమే కాదు… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నాటి నుంచి తెలుగుదేశానికి వల్లభనేని కొరకరాని కొయ్యగా తయారయ్యారు. తాజాగా.. అసెంబ్లీ సమావేశాల్లోనూ.. టీడీపీ నేతల వెనకే కూర్చుంటూ.. వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ఆ పార్టీ గుండెల్లో […]

టీడీపీ గుండెల్లో.... వల్లభనేని వంశీ గునపాలు
X

వల్లభనేని వంశీ. ఈ పేరు చెబితే చాలు… తెలుగుదేశం నేతలు చికాకు పడే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఇటీవలే అధినేత చంద్రబాబును చీల్చి చెండాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపించడమే కాదు… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నాటి నుంచి తెలుగుదేశానికి వల్లభనేని కొరకరాని కొయ్యగా తయారయ్యారు.

తాజాగా.. అసెంబ్లీ సమావేశాల్లోనూ.. టీడీపీ నేతల వెనకే కూర్చుంటూ.. వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. ఆ పార్టీ గుండెల్లో గునపాలు దించుతున్నారు.. వల్లభనేని వంశీ. అమ్మ ఒడి పథకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. టీడీపీ నేతలను చికాకుపెట్టారు. పైగా.. ఈ చర్చలో చంద్రబాబు ఉండుంటే ఇంకా బాగుండేదని అని.. వారిని ఇరకాటంలో పెట్టారు. ఇలాంటి పథకానికి టీడీపీ మద్దతు ఇవ్వకపోవడం దారుణమన్న వంశీ.. పథకం లక్ష్యాలను అభినందించారు.

వాస్తవానికి వల్లభనేని వంశీ ఏనాడో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరతారని అంతా అనుకున్నారు. కానీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తన పార్టీలోకి రావాలంటే.. రాజీనామాలు చేస్తే కానీ.. తీసుకునేది లేదని జగన్ తేల్చి చెప్పారు.

మరోవైపు.. ఇప్పటికిప్పుడు వంశీ పార్టీ మారినా… అధికార పార్టీకి ఓ ఎమ్మెల్యే బలం పెరగడం తప్ప.. అంతగా ఒరిగేది ఏమీ లేదు. అందుకే.. టీడీపీని వీడకుండా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరకుండా వంశీ తటస్థంగా ఉంటున్నారు.

ఇటు చంద్రబాబును చూస్తే… మళ్లీ ఎన్నికలు వస్తే గన్నవరంలో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో… అన్న ఆందోళన ఆయనలో వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇలాంటి సందర్భంలో.. వంశీని ఏమీ అనలేక.. అలా అని ఆయన మాటలు భరించలేక.. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయట.

ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. వల్లభనేని మాటలు.. టీడీపీ గుండెల్లో గునపాలుగా గుచ్చుకుంటున్నాయట. అపర రాజకీయ అనుభవం ఉన్న మేధావిని అని చెప్పుకుంటున్న తమ నాయకుడికి ఇలాంటి కష్టాలు రావడం ఏమిటోనంటూ టీడీపీ నాయకులు లోలోన మధనపడుతున్నారట.

First Published:  21 Jan 2020 3:37 PM IST
Next Story