Telugu Global
NEWS

ప్రతి 4 జిల్లాలకు ఒక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రం... ఏపీలో కొత్త ప్రతిపాదన

ఇప్పటికే 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా.. ప్రతి 4 జిల్లాలకు ఓ ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. తాము చెబుతున్నట్టుగా.. అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణకు తగిన అవకాశాలు కల్పించాలంటే.. పాలనలో ఈ మార్పు తేవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట. శాసన, కార్యనిర్వాహక, న్యాయ రాజధానులను పరిపాలనలో భాగం చేస్తూనే.. ప్రతి 4 జిల్లాలకు ఓ ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి… నిత్యం […]

ప్రతి 4 జిల్లాలకు ఒక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రం... ఏపీలో కొత్త ప్రతిపాదన
X

ఇప్పటికే 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా.. ప్రతి 4 జిల్లాలకు ఓ ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

తాము చెబుతున్నట్టుగా.. అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణకు తగిన అవకాశాలు కల్పించాలంటే.. పాలనలో ఈ మార్పు తేవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట. శాసన, కార్యనిర్వాహక, న్యాయ రాజధానులను పరిపాలనలో భాగం చేస్తూనే.. ప్రతి 4 జిల్లాలకు ఓ ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి… నిత్యం అభివృద్ధి కార్యక్రమాలను, పాలనను బేరీజు వేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం భావిస్తోందట.

అలాగే.. ఈ ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలకు ఒక్కోదానికి ఓ సూపర్ కలెక్టర్ పోస్టును సృష్టించే ఆలోచన కూడా ప్రభుత్వం మదిలో ఉంది. ఈ లెక్కన.. రాష్ట్ర స్థాయిలో అధికార యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జిల్లా స్థాయిలో కలెక్టర్ నంబర్ వన్ గా ఉన్నట్టే.. 4 జిల్లాల చొప్పున ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలకు సదరు సూపర్ కలెక్టర్ నంబర్ వన్ అధికారిగా ఉంటారు. జిల్లాల కలెక్టర్లు.. సూపర్ కలెక్టరుకు అనుబంధంగా పని చేస్తారు.

ఇప్పటికే గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాలంటీర్ల నియామకంతో పరిపాలనను ప్రతి ఇంటికీ.. ప్రతి వ్యక్తి దగ్గరకూ చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా.. ప్రాంతీయ అభివృద్ధి మండలితోపాటు.. సూపర్ కలెక్టర్ పోస్టులు సృష్టిస్తే.. అది పాలనలో మరో సంస్కరణ అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవస్థలన్నీ మూడు రాజధానులకూ అనుసంధానమై.. పాలనతో పాటు.. అభివృద్ధినీ కొత్త పుంతలు తొక్కించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

అసలే.. 3 రాజధానుల ప్రతిపాదనతో విపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆసక్తికరంగా ఉన్న ఈ తాజా ప్రతిపాదనలపై ఎలా స్పందిస్తాయన్నది.. ఆసక్తికరంగా మారింది.

First Published:  20 Jan 2020 10:28 AM IST
Next Story