అచ్చెన్నాయుడిపై స్పీకర్ ఆగ్రహం
సీఆర్‌డీఏ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు పదే పదే అచ్చెన్నాయుడు అడ్డు తగులుతుండడంతో ఆయనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడంటూ స్పీకర్ మండిపడ్డారు. దీనికి తోడు రాజధాని భూముల్లో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని స్పీకర్ తమ్మినేని కోరడం… అందుకు ముఖ్యమంత్రి అంగీకరించడం వెంటవెంటనే జరిగాయి. దీంతో వెంటనే ప్రతిపక్ష సభ్యులు కొందరు… విచారణ జరపాలని కోరే హక్కు మీకు ఎవరిచ్చారంటూ […]
సీఆర్‌డీఏ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు పదే పదే అచ్చెన్నాయుడు అడ్డు తగులుతుండడంతో ఆయనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడంటూ స్పీకర్ మండిపడ్డారు.
దీనికి తోడు రాజధాని భూముల్లో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని స్పీకర్ తమ్మినేని కోరడం… అందుకు ముఖ్యమంత్రి అంగీకరించడం వెంటవెంటనే జరిగాయి.
దీంతో వెంటనే ప్రతిపక్ష సభ్యులు కొందరు… విచారణ జరపాలని కోరే హక్కు మీకు ఎవరిచ్చారంటూ గొడవ చేశారు. వాళ్ళపై మండిపడ్డ స్పీకర్ ‘డోంట్ టాక్ రబ్బిష్… తనకు ఏ అధికారం ఉందో లేదో శాసనసభ నిర్ణయిస్తుంది కానీ… ప్రతిపక్ష సభ్యులైన మీరు కాదు… అయినా నా అధికారాలను మీరు ప్రశ్నించడం ఏమిటి?’… అంటూ మండిపడ్డారు.
తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారు అంటూ ఆయన ప్రతిపక్ష సభ్యులను నిలదీశారు.