Telugu Global
NEWS

చంద్రబాబు మనుషులకు మంచి ప్లాట్లు...

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్‌ యోచిస్తున్నారన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇలా స్పందించారు ఆర్కే. సామాన్య ప్రజలకు సచివాలయానికి వెళ్ళే అవసరం సాధారణంగా ఉండదని… గ్రామ సచివాలయాలతో ప్రజలముందుకే ప్రభుత్వం వెళ్ళిందన్నారు ఆర్కే. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ భయంతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. అమారావతిలో ప్రజలు ధర్నాలకు రాకపోవడంతో… టీడీపీ బినామీలను పంపి ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు ఆర్కే. చంద్రబాబు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని […]

చంద్రబాబు మనుషులకు మంచి ప్లాట్లు...
X

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్‌ యోచిస్తున్నారన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇలా స్పందించారు ఆర్కే.

సామాన్య ప్రజలకు సచివాలయానికి వెళ్ళే అవసరం సాధారణంగా ఉండదని… గ్రామ సచివాలయాలతో ప్రజలముందుకే ప్రభుత్వం వెళ్ళిందన్నారు ఆర్కే.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ భయంతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. అమారావతిలో ప్రజలు ధర్నాలకు రాకపోవడంతో… టీడీపీ బినామీలను పంపి ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు ఆర్కే.

చంద్రబాబు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీసుకొచ్చిన భూ సేకరణ చట్టాన్ని ఎత్తివేస్తేనే అమరావతి ప్రాంత రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు ఆయన. రైతుల దగ్గరనుంచి భూములను తీసుకుని వారికి ప్లాట్లు కేటాయించారని… అయితే చంద్రబాబు మనుషులకు మాత్రం మంచి ప్లాట్లు, నార్త్‌ఈస్ట్‌ కార్నర్‌ ప్లాట్లు, విలువైన ప్లాట్లు దక్కాయని… ఇది చంద్రబాబు మాయ అని ఆర్కే అన్నారు.

2014 ఎన్నికల్లో మంగళగిరిలో నేను గెలిస్తే… తాడికొండలో టీడీపీ గెలిచిందని గుర్తుచేశారు. రాజధాని పేరిట చంద్రబాబు డ్రామా చేసినా… ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచిందని… చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అభివృద్ధి జరిగివుంటే టీడీపీ ఎందుకు రెండు చోట్లా ఓడింది అని నిలదీశారు ఆర్కే.

రాజధాని ప్రాంత ప్రజలకు చంద్రబాబు గురించి బాగా తెలుసునని… అభివృద్ధి చేసుంటే తాడికొండలో టీడీపీ గెలిచి ఉండేదని… అలా జరగలేదు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో బుద్దిచెప్పారన్నారు ఆర్కే. చంద్రబాబు తన సోషల్‌ మీడియా ద్వారా సీఎం జగన్‌ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అభివృద్ధి వికేంద్రీకరణకు చాలామంది రైతులు అనుకూలంగా ఉన్నారని… జగన్‌ చెబితే చేస్తారన్నది రాజధాని రైతుల ప్రగాఢ విశ్వాసమన్నారు. చంద్రబాబు రాజధాని పేరుతో రైతు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని.. చంద్రబాబు నిర్ణయంతో రైతు కూలీలు అదృశ్యమైపోయారని… ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల కూలీలేనన్నారు ఆయన.

రాజధాని పేరుతో భూయజమానులు చాలామంది కోట్లాను కోట్లు చూశారని… అలాగే చాలామంది వేలరూపాయలు కూడా చూడని దుస్థితీ రాజధానిలో ఉందన్నారు ఆర్కే. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్ళుకూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తాను కోరుకుంటున్నానన్నారు. అధికార వికేంద్రీకరణ బిల్లుకు పూర్తిగా తాను మద్ధతు ఇస్తున్నానని… నాకు రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం… రాజకీయ భవిష్యత్తు కాదని… అమరావతి కోసం లక్షన్నర కోట్లు అవసరమా అనిపించిందన్నారు ఎమ్మెల్యే ఆర్కే. రాజకీయాల్లో ఉన్నంతకాలం తాను జగన్‌ వెంటే ఉంటానని… లేకుంటే చేలో కనిపిస్తానని ఆయన చెప్పారు.

First Published:  20 Jan 2020 10:29 AM IST
Next Story