Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియాపై సిరీస్ నెగ్గిన భారత్

బెంగళూరు వన్డేలో రోహిత్, కొహ్లీ షో ఆస్ట్ర్రేలియాతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 2-1తో నెగ్గి 2019 సిరీస్ ఓటమికి బదులుతీర్చుకొంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో భారత్ 7 వికెట్లతో ఆస్ట్ర్రేలియాను అధిగమించింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన సెంచరీహీరో రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. స్మిత్ ఫైటింగ్ సెంచరీ… […]

ఆస్ట్ర్రేలియాపై సిరీస్ నెగ్గిన భారత్
X
  • బెంగళూరు వన్డేలో రోహిత్, కొహ్లీ షో

ఆస్ట్ర్రేలియాతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 2-1తో నెగ్గి 2019 సిరీస్ ఓటమికి బదులుతీర్చుకొంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో భారత్ 7 వికెట్లతో ఆస్ట్ర్రేలియాను అధిగమించింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన సెంచరీహీరో రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

స్మిత్ ఫైటింగ్ సెంచరీ…

సిరీస్ సొంతం చేసుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన భారత్…ప్రత్యర్థిని 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులకు పరిమితం చేసింది.

మాజీ కెప్టెన్ , స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మాస్టర్ క్లాస్ సెంచరీ సాధించాడు. స్మిత్ 132 బాల్స్ లో 14 బౌండ్రీలు, ఒక సిక్సర్ తో 131 పరుగుల స్కోరు సాధించాడు.

భారత్ ప్రత్యర్థిగా గత మూడుసంవత్సరాల కాలంలో స్మిత్ కు ఇదే తొలిసెంచరీ కావడం విశేషం. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు, జడేజా 2 వికెట్లు పడగొట్టారు.

రోహిత్ 29వ శతకం…

287 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రాహుల్- రోహిత్ మొదటి వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. రాహుల్ 19 పరుగుల స్కోరుకు స్పిన్నర్ అగర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

రాహుల్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కొహ్లీతో కలసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ రెండో వికేట్ కు సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశాడు. రోహిత్ 8 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 119 పరుగుల స్కోరు సాధించాడు.

2020 సీజన్లో తన తొలిశతకాన్ని సాధించిన రోహిత్ శర్మ…వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. లెగ్ స్పిన్నర్ జంపా బౌలింగ్ లో రోహిత్ అవుట్ కావడంతో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు దిగాడు. మూడో వికెట్ కు కొహ్లీ- అయ్యర్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విజయం ఖాయం చేశారు.

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ 91 బాల్స్ లో 8 బౌండ్రీలతో 89 పరుగుల స్కోరుకు …ఫాస్ట్ బౌలర్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో అవుట్ కావడంతో వెనుదిరిగాడు. కొత్తసంవత్సరం తొలిసిరీస్ ను కొహ్లీ శతకం లేకుండానే ముగించడం విశేషం.

విరాట్ కొహ్లీ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు సాధించిన భారత కెప్టెన్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మహేంద్రసింగ్ ధోనీ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.

ధోనీ 127 ఇన్నింగ్స్ లో కెప్టెన్ గా 5వేల పరుగులు సాధిస్తే… విరాట్ కొహ్లీ కేవలం 82 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సొంతం చేసుకోడం విశేషం.

2019 మార్చిలో భారత గడ్డపై కంగారూల చేతిలో వన్డే సిరీస్ ఓటమి పొందిన భారత్… 2020 సిరీస్ లో మాత్రం బదులుతీర్చుకోగలిగింది.

First Published:  20 Jan 2020 3:00 AM IST
Next Story