Telugu Global
NEWS

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. మళ్లీ ఇబ్బందులు రావొద్దని!

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. టీడీపీ నేతలు ఎంతగా రాద్ధాంతం చేసినా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్లింది. అంతా భావించినట్టుగా.. మూడు రాజధానుల ప్రతిపాదనపై అడుగు ముందుకు వేసింది. ఈ దిశగా జగన్ ప్రభుత్వం చాలా కసరత్తు చేసిన విషయం స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించిన బిల్లును.. సభలో ప్రవేశ పెట్టిన సమయంలో.. మంత్రులు చేసిన వాదన వింటే.. కాస్త సహేతుకంగానే అనిపిస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను […]

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. మళ్లీ ఇబ్బందులు రావొద్దని!
X

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. టీడీపీ నేతలు ఎంతగా రాద్ధాంతం చేసినా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్లింది. అంతా భావించినట్టుగా.. మూడు రాజధానుల ప్రతిపాదనపై అడుగు ముందుకు వేసింది. ఈ దిశగా జగన్ ప్రభుత్వం చాలా కసరత్తు చేసిన విషయం స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించిన బిల్లును.. సభలో ప్రవేశ పెట్టిన సమయంలో.. మంత్రులు చేసిన వాదన వింటే.. కాస్త సహేతుకంగానే అనిపిస్తోంది.

ముఖ్యమైన విషయం ఏంటంటే.. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చింది. కానీ.. అమరావతిపైనే ఎక్కువ దృష్టి పెట్టి.. ఆ పనులనూ సమర్థంగా పూర్తి చేయలేక.. ఎన్నికల్లో చతికిలబడింది. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల పుణ్యమా అని.. ఉత్తరాంధ్రతో పాటు.. రాయలసీమలోనూ ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చెప్పిన అభివృద్ధి జరగక.. ఆశించిన ప్రగతి సాధ్యం కాక.. ఉసూరుమన్నారు.

చివరికి జగన్ ప్రభుత్వం వచ్చాక.. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేలా మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. ఆ ప్రతిపాదనను శాసనసభ ముందు ప్రవేశపెట్టింది. సదరు బిల్లును చట్టంగా మార్చి.. మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. సమయం గడిచింది కాబట్టి.. ఇప్పుడు చర్చించాల్సింది ఇక అమరావతి కాదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది.

అందుకే.. రాజధాని గ్రామాల్లో తప్ప.. ఇతర ప్రాంతాల్లో ఎక్కడా టీడీపీ ప్రేరేపిత ఆందోళనలు తప్ప.. అమరావతిపై ఆరాటం ఎక్కడా కనిపించడం లేదు. ఇదే సందర్భంలో వైసీపీ నేతలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందితే.. భవిష్యత్తులో మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉంటాయని.. ఆ దిశగానే జగన్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

గతంలో హైదరాబాద్ పైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. తెలంగాణ అభివృద్ధిని విస్మరించారు. అందుకే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు అమరావతిపైనే దృష్టి పెడుతున్నారు. భవిష్యత్తులో రాయలసీమ ఉద్యమం జరగబోదని గ్యారెంటీ ఏంటి? అందుకే.. ఇలాంటి సమస్యలు మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకే.. జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చి.. అమలు ప్రక్రియనూ ముందుకు తీసుకుపోతున్నారని చెబుతున్నారు.

First Published:  20 Jan 2020 10:26 AM IST
Next Story