ఈరోజు షిర్డి బంద్ !
షిర్డి సాయి జన్మస్థలంపై వివాదం ముదిరింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ పిర్డి బంద్ పాటిస్తున్నారు. అయితే ఇటు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఆలయం తెరిచి ఉంటుందని, అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. సాయిబాబా జన్మస్థలంగా భక్తులు భావించే పత్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్దవ్ థాక్రే ప్రకటించడంతో ఈ వివాదం చెలరేగింది. సీఎం నిర్ణయాన్ని నిరసిస్తూ షిర్డితో పాటు చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు బంద్‌కు పిలుపునిచ్చారు. శివసేన […]
షిర్డి సాయి జన్మస్థలంపై వివాదం ముదిరింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ పిర్డి బంద్ పాటిస్తున్నారు. అయితే ఇటు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఆలయం తెరిచి ఉంటుందని, అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది.
సాయిబాబా జన్మస్థలంగా భక్తులు భావించే పత్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్దవ్ థాక్రే ప్రకటించడంతో ఈ వివాదం చెలరేగింది. సీఎం నిర్ణయాన్ని నిరసిస్తూ షిర్డితో పాటు చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు బంద్‌కు పిలుపునిచ్చారు.
శివసేన ఉద్దేశపూర్వకంగానే షిర్డి ప్రాధాన్యత తగ్గించాలని చూస్తోందని ఈ గ్రామాల ప్రజలు మండిపడ్డారు. దేశంలో మిగతా సాయిబాబా ఆలయాల మాదిరిగానే పత్రి ఆలయం ఉందని… దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదని షిర్డివాసులు చెప్పుకొచ్చారు.
మరోవైపు పత్రిలోనే బాబా జన్మించారనేందుకు చారిత్రక ఆధారాలున్నాయని శివసేన, ఎన్సీపీ నేతలు అంటున్నారు. పత్రి జన్మభూమి కాగా, షిర్డీ సాయి కర్మభూమి అని, రెండు ప్రాంతాలూ భక్తులకు ముఖ్యమైనవేనన్నారు.
పత్రి ప్రాధాన్యం పెరిగితే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందేమోనని షిర్డీ ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అశోక్ చవాన్ మాట్లాడుతూ… బాబా జన్మస్థలంపై వివాదం కారణంగా పత్రిలో భక్తులకు సౌకర్యాల కల్పనను అడ్డుకోవడం సరికాదన్నారు.