Telugu Global
NEWS

తెగించిన బాబు... వైసీపీని ఇరుకున పెట్టే ప్లాన్!

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెగించినట్టే కనిపిస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తన ప్రయత్నాన్ని అసెంబ్లీ ముట్టడి వరకూ తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఓ వైపు.. 144 సెక్షన్ కొనసాగుతోందని.. అమరావతిలో ఎలాంటి నిరసనకూ అవకాశం లేదని పోలీసులు తేల్చి చెబుతుంటే.. మరోవైపు చంద్రబాబు మాత్రం.. ఎవరు అరెస్ట్ చేస్తారో చూస్తాం.. ముట్టడి చేసి తీరుతాం అంటూ ఆవేశంగా చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఓ విషయం మాత్రం అర్థమవుతోంది. తాను అరెస్టుకైనా సిద్ధమే అని చంద్రబాబు […]

తెగించిన బాబు... వైసీపీని ఇరుకున పెట్టే ప్లాన్!
X

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెగించినట్టే కనిపిస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తన ప్రయత్నాన్ని అసెంబ్లీ ముట్టడి వరకూ తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు.

ఓ వైపు.. 144 సెక్షన్ కొనసాగుతోందని.. అమరావతిలో ఎలాంటి నిరసనకూ అవకాశం లేదని పోలీసులు తేల్చి చెబుతుంటే.. మరోవైపు చంద్రబాబు మాత్రం.. ఎవరు అరెస్ట్ చేస్తారో చూస్తాం.. ముట్టడి చేసి తీరుతాం అంటూ ఆవేశంగా చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే.. ఓ విషయం మాత్రం అర్థమవుతోంది. తాను అరెస్టుకైనా సిద్ధమే అని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. అదే జరిగితే.. తెలుగుదేశం నేతల చర్యలు ఎక్కడికైనా వెళ్లొచ్చని.. ఫలితంగా శాంతి భద్రతలు అదుపు తప్పితే ఆ తప్పును రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసేయవచ్చని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. పోలీసులు వద్దని చెబుతున్నా.. మేం చేసి చూపిస్తాం అని ఆయన అంటుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం వెనక మరో మతలబు కూడా ఉన్నట్టు సైకిల్ పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారట. అదేంటయ్యా అంటే.. తాము అసెంబ్లీకి వెళ్తే.. అమరావతిపై చర్చ జరిగితే.. మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వే కాబట్టి తెలుగుదేశం ఓడిపోతే ఎలా అని చంద్రబాబు అండ్ కో ఆలోచిస్తున్నారట. అప్పుడు అమరావతి గురించి మరింత కొట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుందన్న డైలమాలో ఉన్నారట. అందుకే అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఇలా మరిన్ని అంశాలపై చంద్రబాబు సుదీర్ఘంగా ఆలోచించాకే.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని, అది ఇచ్చిన అనుభవాన్ని ఉపయోగింది.. అసెంబ్లీ ముట్టడి నిర్ణయానికి వచ్చి ఉంటారని కొందరు భావిస్తున్నారు.

అందుకే.. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలని పలువురు సన్నిహితులు ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నారట. రాజకీయంగా చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే.. కాస్త సంయమనంతో వ్యవహరిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారట. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. తన నిర్ణయానికే కట్టుబడ్డారని పార్టీ నేతలు చెబుతున్నారు. 3 రాజధానులు ఖాయమంటున్నారు.

ఇదే నిజమైతే.. చంద్రబాబు ఏం చేయబోతున్నారు.. ముఖ్యమంత్రిగా జగన్ ఎలాంటి అఢుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

First Published:  19 Jan 2020 4:48 PM IST
Next Story