Telugu Global
National

షిర్డీ సాయి పుట్టిందెక్కడ? సరికొత్త వివాదం !

సాయిబాబా జన్మ స్థలం ఎక్కడ? ఆయన షిర్డీలో పుట్టలేదా? ఇప్పుడు ఈ అంశం దేశంలో కలకలం రేపుతోంది. షిర్డి సాయిబాబా పర్బిని జిల్లాలోని పత్రిలో పుట్టారని.. ఆ ఊరును డెవలఫ్‌ చేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే ప్రకటించారు. దీంతో సాయిబాబా జన్మభూమి ఏంటి అనే దానిపై చర్చ మొదలైంది. సద్గురు సాయిబాబా జన్మస్థలం పర్బిని జిల్లాకు చెందిన ‘పత్రి’ అని స్థానికులు భావించి 1999లో శ్రీ సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడికి వేల సంఖ్యలో […]

షిర్డీ సాయి పుట్టిందెక్కడ? సరికొత్త వివాదం !
X

సాయిబాబా జన్మ స్థలం ఎక్కడ? ఆయన షిర్డీలో పుట్టలేదా? ఇప్పుడు ఈ అంశం దేశంలో కలకలం రేపుతోంది. షిర్డి సాయిబాబా పర్బిని జిల్లాలోని పత్రిలో పుట్టారని.. ఆ ఊరును డెవలఫ్‌ చేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే ప్రకటించారు. దీంతో సాయిబాబా జన్మభూమి ఏంటి అనే దానిపై చర్చ మొదలైంది.

సద్గురు సాయిబాబా జన్మస్థలం పర్బిని జిల్లాకు చెందిన ‘పత్రి’ అని స్థానికులు భావించి 1999లో శ్రీ సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో పత్రి పట్టణాభివృద్ధికి వంద కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవలే ప్రకటించారు. అయితే దీనిపై భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇంత వరకు సాయిబాబా జన్మస్థలంపై వివాదం లేదని కేవలం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తెరపైకి వచ్చిందంటున్నారు. అందుకు ఉధ్దవ్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం కారణమని ఆరోపిస్తోంది విపక్ష బీజేపీ.

పత్రి.. పర్బిని జిల్లాలో ఉంది. అది ఆయన జన్మస్థలం అంటున్నారు. అలాగే షిర్డీ.. అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉంది. ఇది ఆయన సమాధి మందిరం. ఈ రెండు ప్రాంతాలకూ మధ్య దూరం 280 కిలోమీటర్లు. అక్కడ పుట్టి తర్వాత కాలంలో సాయి.. షిర్డీకి వచ్చినట్లు ఓ విశ్వాసం.

అహ్మద్‌నగర్‌ జిల్లాలోని షిరిడీ.. సాయిబాబా ‘కర్మ భూమి’ అయితే పత్రి ఆయన ‘జన్మభూమి’ అని ఉద్దవ్‌ సర్కారు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది బీజేపీ. పత్రికి ప్రాధాన్యం లభిస్తే తమ క్షేత్ర ప్రాధాన్యం తగ్గుతుందని షిరిడీ వాసులు భయాందోళనకు గురవుతున్నారంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడీ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

రేపట్నుంచి షిరిడీ ఆలయం మూసివేస్తామంటూ గ్రామస్తుల ప్రకటనను షిరిడీ ట్రస్ట్ ఖండించింది. గ్రామస్థుల ప్రకటనతో తమకు సంబంధం లేదని….భక్తులెవరూ ఆందోళన చెందవద్దని ఓ ప్రకటనలో తెలిపింది. స్వామి సేవలు యధావిధిగా కొనసాగుతాయని….ఇవాళ సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని షిరిడీ ట్రస్ట్ తెలిపింది.

షిర్డిలో కొలువైన సాయిబాబాకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. సాయి దివ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో షిర్డీకి తరలి వస్తుంటారు. ఈనేపథ్యంలో ఆలయాన్ని నిరవధికంగా మూసివేసే నిర్ణయం సరైందేనా? కాదా? అన్న అంశంపై సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ సభ్యులు చర్చించనున్నారు.

స్థానికులతో సమావేశం అనంతం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సాయిబాబా సంస్థాన్ సభ్యుడు బహుసాహెబ్‌ ప్రకటించారు.

First Published:  18 Jan 2020 6:09 AM IST
Next Story