Telugu Global
NEWS

రెండోవన్డేలో భారత్ కు డూ ఆర్ డై

రాజ్ కోటలో నెగ్గితేనే సిరీస్ ఆశలు సజీవం భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల తీన్మార్ వన్డే సిరీస్ రెండోమ్యాచ్ కే హాట్ హాట్ గా మారింది. ఆతిథ్య భారత్ కు డూ ఆర్ డై గా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే..రాజ్ కోట్ వేదికగా మరికాసేపట్లో జరిగే రెండో వన్డేలో విరాట్ సేన ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది. మరోవైపు..4వ ర్యాంకర్ కంగారూజట్టు మాత్రం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. భారత్ సత్తాకు […]

రెండోవన్డేలో భారత్ కు డూ ఆర్ డై
X
  • రాజ్ కోటలో నెగ్గితేనే సిరీస్ ఆశలు సజీవం

భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల తీన్మార్ వన్డే సిరీస్ రెండోమ్యాచ్ కే హాట్ హాట్ గా మారింది. ఆతిథ్య భారత్ కు డూ ఆర్ డై గా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే..రాజ్ కోట్ వేదికగా మరికాసేపట్లో జరిగే రెండో వన్డేలో విరాట్ సేన ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.

మరోవైపు..4వ ర్యాంకర్ కంగారూజట్టు మాత్రం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

భారత్ సత్తాకు అసలు పరీక్ష…

గత ఏడాదికాలంలో ఆడిందే ఆటగా…నెగ్గిందే సిరీస్ గా సాగిన భారత్ కు కొత్తసంవత్సరంలో ఆస్ట్ర్రేలియా రూపంలో అసలు పరీక్ష ఎదురయ్యింది. ముంబై వాంఖెడీ స్టేడియంలో ముగిసిన ఏకపక్ష పోరులో ఎదురైన 10 వికెట్ల ఘోరపరాజయంతో విరాట్ అండ్ కో రగిలిపోతున్నారు.

బ్యాటింగ్ లో 255 పరుగులకే కుప్పకూలడం… బౌలింగ్ లో కనీసం ఒక్క వికెట్టు పడగొట్టలేకపోడాన్ని భారత టీమ్ మేనేజ్ మెంట్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.

వన్ డౌన్ లోనే కొహ్లీ…..

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తొలివన్డే ఓటమి నుంచి పాఠం నేర్చుకొన్నట్లే ఉన్నాడు. అనవసరమైన ప్రయోగాలు, త్యాగాలకు పోకుండా తనకు అచ్చివచ్చిన వన్ డౌన్ స్థానంలోనే బ్యాటింగ్ కు దిగాలని భావిస్తున్నాడు.

ఓపెనర్లు ధావన్- రోహిత్ , వన్ డౌన్లో కొహ్లీ, రెండోడౌన్లో రాహుల్ బ్యాటింగ్ కు దిగనున్నారు. మిడిలార్డర్ లో స్పిన్ ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి.

స్పిన్ జోడీ చహాల్, కుల్దీప్ లలో ఒకరికి, పేస్ జోడీ శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీలలో ఒకరిని తుదిజట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

రాజ్ కోటలో పరుగుల వెల్లువే…

బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉండే రాజ్ కోట్ స్టేడియంలో 300కు పైగా భారీస్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండుజట్లు తలపడిన గత 29 వన్డేలలో 25సార్లు 300కు పైగా స్కోర్లు నమోదు కావడం చూస్తే… రెండుజట్ల బ్యాటింగ్ పవర్ ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు.

మరోవైపు…తొలివన్డే విజయంతో ఉరకలేస్తున్న కంగారూటీమ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ సొంతం చేసుకోవాలన్న కసితో ఉంది.

ఆసీస్ దే పైచేయి….

భారత వేదికగా భారత్ ను వన్డే సిరీస్ ల్లో కంగుతినిపించడం ఆస్ట్ర్రేలియాకు ఇదే మొదటిసారి కాదు. గత సిరీస్ లో సైతం భారత్ ను కంగుతినిపించిన కంగారూజట్టుకు.. భారత గడ్డపై గత భారత్ ప్రత్యర్థిగా నాలుగు వరుస విజయాలు సాధించిన రికార్డు సైతం ఉంది. తుదిజట్టులో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ కు చోటు కల్పించే అవకాశాలున్నాయి.

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈమ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టుకే విజయావకాశాలున్నాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 320కి పైగా స్కోరు సాధించగలిగితేనే.. విజేతగా నిలిచే అవకాశం ఉంది.

కొహ్లీని ఊరిస్తున్న జంట రికార్డులు..

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని విజయంతో పాటు…జంట రికార్డులు ఊరిస్తున్నాయి. సచిన్ పేరుతో ఉన్న 20 స్వదేశీ వన్డే సెంచరీలతో పాటు…కంగారూగ్రేట్ రికీ పాంటింగ్ పేరుతో ఉన్న కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ రికార్డును సైతం..కొహ్లీ…మరో సెంచరీతో సాధించే అవకాశం ఉంది.

మొత్తం మీద…భారత్ కమ్ విరాట్ కొహ్లీ ఆత్మాభిమానానికి పరీక్షగా నిలిచిన ఈ మ్యాచ్ లో ఆతిథ్యజట్టు విజయం కోసమే దేశంలోని కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. క్రికెట్ ను మాత్రమే ఆరాధించే అసలు సిసలు అభిమానులు మాత్రం…బాగా ఆడినజట్టే విజేతగా నిలవాలని కోరుకొంటున్నారు.

First Published:  17 Jan 2020 3:56 AM IST
Next Story