ఏపీలో పవన్, బీజేపీ పొత్తు ప్రభావమెంత?
ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈమేరకు రెండు పార్టీల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ పొత్తులు అంటూ పార్టీలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ప్రభావమెంత? అనే లెక్కలు మొదలయ్యాయి. రెండు పార్టీలు కలిస్తే అద్భుతాలు జరుగుతాయా? అసలేం జరుగుతుంది? అని పొలిటికల్ లెక్కలు తీస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలు ఒక్కసారి చూస్తే.. బీజేపీకి […]
ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈమేరకు రెండు పార్టీల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ పొత్తులు అంటూ పార్టీలు ప్రకటించాయి.
అయితే ఇప్పుడు బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ప్రభావమెంత? అనే లెక్కలు మొదలయ్యాయి. రెండు పార్టీలు కలిస్తే అద్భుతాలు జరుగుతాయా? అసలేం జరుగుతుంది? అని పొలిటికల్ లెక్కలు తీస్తే అసలు విషయాలు బయటపడ్డాయి.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలు ఒక్కసారి చూస్తే.. బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్లు 2 లక్షల 64వేల 303. నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ. నోటాకు 4లక్షల ఒక వెయ్యి 969 ఓట్లు. అంటే నోటా కంటే రెండు లక్షలు తక్కువగా వచ్చాయి.
ఇటు జనసేనకు వచ్చిన ఓట్లు 16,76,349. ఈ లెక్క ప్రకారం చూస్తే ఐదుశాతానికి పైగా ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేయడంతో ఈ ఓట్లు పడ్డాయి. ఈ ఓట్లలో కొత్త ఓటర్లు లక్షకు పైగా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఈ 19 లక్షల ఓట్లు కూటమికి పోలవుతాయో లేదో ఇప్పుడు చెప్పడం కష్టం.
ఇటు బీజేపీ, జనసేన కూటమితో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయో అనేది చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలు లోకల్ అంశాలు ఎక్కువ ప్రభావితం చూపుతాయి. పార్టీ సింబల్‌పై ఎన్నికలు జరిగినా…లోకల్ క్యాండిడేట్లు, సమీకరణాల ఎఫెక్ట్ ఎక్కువ.