Telugu Global
National

చివరికి శైలజానాథ్ దిక్కయ్యాడు...

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పగ్గాలు వదిలేసి.. రాజకీయాలకు సెలవు ప్రకటించేసి సుబ్బరంగా తన సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. దాదాపు 8 నెలల సుధీర్ఘ విరామం తరువాత ఏపీలో స్తబ్దుగా మారిన కాంగ్రెస్ పార్టీకి ఒక చీఫ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఏఐసీసీ గురువారం ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి, సీమ సీనియర్ నాయకుడు శైలజానాథ్ ను నియమించింది. కాంగ్రెస్ సీనియర్ […]

చివరికి శైలజానాథ్ దిక్కయ్యాడు...
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పగ్గాలు వదిలేసి.. రాజకీయాలకు సెలవు ప్రకటించేసి సుబ్బరంగా తన సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. దాదాపు 8 నెలల సుధీర్ఘ విరామం తరువాత ఏపీలో స్తబ్దుగా మారిన కాంగ్రెస్ పార్టీకి ఒక చీఫ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.

ఏఐసీసీ గురువారం ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి, సీమ సీనియర్ నాయకుడు శైలజానాథ్ ను నియమించింది. కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి, షేక్ మస్తాన్ వలీలను ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది.

ఉమ్మడి ఏపీని విభజించి అప్పటి వరకూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఒక్క అసెంబ్లీ సీటును ఏపీలో గెలవలేక భూస్థాపితమైపోయింది. 2019లోనూ ప్రజలు తిరస్కరించారు. పీసీసీ చీఫ్ గా రఘువీరా వైదొలిగాక పీసీసీ చీఫ్ పదవిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆరు సార్లు ఎంపీగా గెలిచిన చింతా మోహన్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు వంటి సీనియర్లను అధిష్టానం తీసుకోమని అభ్యర్థించినప్పటికీ ఎవరూ చేపట్టడానికి ఆసక్తి చూపలేదు.

చిట్టచివరకు శైలజానాథ్ ను పీసీసీ చీఫ్ పదవి తీసుకోవాలని అధిష్టానం కోరింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన దళిత నేత, వైఎస్ ప్రభుత్వంలో విప్ గా, కిరణ్ హయాంలో మంత్రిగా చేసిన శైలజానాథ్ ను పీసీసీ చీఫ్ గా చేసింది కాంగ్రెస్.

అయితే ఏపీలో దాదాపు చచ్చుబడిపోయిన కాంగ్రెస్ ను శైలజనాథ్ ఎంతవరకూ పైకిలేపుతారు.. అది సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ ను పునరుద్ధరించడం కష్టమని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. మరి శైలజనాథ్ ఏం చేస్తారన్నది వేచిచూడాలి.

First Published:  17 Jan 2020 7:02 AM IST
Next Story