కమిన్స్ బౌన్సర్ దెబ్బతో రిషబ్ అవుట్
రాజ్ కోట వన్డేకు భారత వికెట్ కీపర్ దూరం ఆస్ట్ర్రేలియాతో వన్డే సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ లకూ…భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. ముంబై వన్డేలో ఆట 44వ ఓవర్లో.. కంగారూ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ విసిరిన బౌన్సర్ దెబ్బతో వికెట్ కీపింగ్ కు దూరమైన 22 ఏళ్ల రిషబ్ పంత్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగిన రిషబ్ 33 బాల్స్ ఎదుర్కొని 28 పరుగులు […]
- రాజ్ కోట వన్డేకు భారత వికెట్ కీపర్ దూరం
ఆస్ట్ర్రేలియాతో వన్డే సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ లకూ…భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. ముంబై వన్డేలో ఆట 44వ ఓవర్లో.. కంగారూ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ విసిరిన బౌన్సర్ దెబ్బతో వికెట్ కీపింగ్ కు దూరమైన 22 ఏళ్ల రిషబ్ పంత్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు.
మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగిన రిషబ్ 33 బాల్స్ ఎదుర్కొని 28 పరుగులు సాధించాడు. కమిన్స్ విసిరిన బౌన్సర్ వచ్చి రిషబ్ పంత్ తలభాగంపైన ఉన్న హెల్మెట్ ను బలంగా తాకడంతో దిమ్మతిరిగి అయోమయంలో పడిపోయాడు. దీంతో..
రిషబ్ ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
సాధారణంగ తలకు బంతి తగిలిన సమయంలో మెదడు భాగానికి హాని జరిగిందీ లేనిదీ పలురకాల పరీక్షల ద్వారా డాక్టర్లు నిర్దారిస్తారు. దెబ్బ తగిలిన 24 గంటల లోపే గాయం తీవ్రత, ఆరోగ్యపరిస్థితి గురించి ప్రకటించాల్సి ఉంది. అయితే…రిషబ్ ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులు ప్రకటించకపోడంతో శుక్రవారం రాజ్ కోట వేదికగా జరిగే రెండో వన్డే లో పాల్గొనబోడని బీసీసీఐ వర్గాలు సమాచారం పంపాయి.
రిషబ్ బెంగళూరులో జరిగే ఆఖరి వన్డేకి సైతం దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టీ-20, వన్డే ఫార్మాట్లలో రిషభ్ పంత్ వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా… టీమ్ మేనేజ్ మెంట్ తో పాటు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ సైతం వెనకేసుకురావడం…అభిమానుల సహనానికే పరీక్షగా మారింది.
అపారప్రతిభ ఉన్న రిషభ్ ను వైఫల్యాలతో ప్రమేయం లేకుండా తగిన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని కెప్టెన్ విరాట్ కొహ్లీ పదేపదే చెబుతూ వస్తున్నాడు. రిషభ్ పంత్ కారణంగా సంజు శాంసన్ లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ను పక్కనపెడుతూ వస్తున్నారు.