Telugu Global
NEWS

ఈ ప్రశ్నకు కేసీఆరే జవాబు చెప్పాలి...

‘రాననుకున్నారా.. రాలేననుకున్నారా?’ అని చిరంజీవి ఇంద్ర సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఈ డైలాగ్ కు కాస్త అర్థం మార్చి.. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన అభిమానులు, సామాన్యులు కొందరు ఓ ప్రశ్న వేస్తున్నారు. రావద్దనుకున్నారా.. రావద్దని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు.. కేసీఆర్ ప్రచారం చేయరు.. అంతా నాదే బాధ్యత.. ఈ ఎన్నికల్లో […]

ఈ ప్రశ్నకు కేసీఆరే జవాబు చెప్పాలి...
X

‘రాననుకున్నారా.. రాలేననుకున్నారా?’ అని చిరంజీవి ఇంద్ర సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఈ డైలాగ్ కు కాస్త అర్థం మార్చి.. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన అభిమానులు, సామాన్యులు కొందరు ఓ ప్రశ్న వేస్తున్నారు. రావద్దనుకున్నారా.. రావద్దని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు.. కేసీఆర్ ప్రచారం చేయరు.. అంతా నాదే బాధ్యత.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించే ఫలితాలు.. నా పనితీరుకు రెఫరెండం అంటూ ఏకంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి, కాబోయే సీఎం అని ప్రచారంలో ఉన్న నాయకుడు కేటీఆర్ చెప్పడంతో.. కేసీఆర్ ని ఇలా ప్రశ్నిస్తున్నారు.

ఏ ఎన్నిక జరిగినా.. కనీసం ఒక్కసారైనా కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించడం.. జనాన్ని ఆకట్టుకునేలా ప్రసంగం చేయడం.. మనం ఇన్నాళ్లూ చూస్తూ వచ్చాం. ఇప్పుడు మాత్రం.. అన్నీ తానై పార్టీని ముందుండి నడిపించేందుకు కేటీఆర్ స్వయంగా చొరవ తీసుకున్నారు.

ఈ విషయంపై.. కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు. అసలు కేటీఆర్ కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని కేసీఆరే నిర్ణయం తీసుకున్నారా? లేదంటే ఇంకెవరైనా ఆయన్ను ఆ దిశగా ఒత్తిడి చేశారా? అన్నది కేసీఆర్ హార్డ్ కోర్ అభిమానులకు అంతుబట్టడం లేదు. ఎందుకు పూర్తి స్థాయి మౌనానికి కేసీఆర్ పరిమితం అవుతున్నారని.. ఈ పరిణామం ఎంత వరకూ వెళ్తుందని.. వారిలో చర్చ కూడా జరుగుతోంది.

ఇప్పుడు కేటీఆర్ భావించినట్టుగా.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయఢంగా మోగిస్తే.. అది కేటీఆర్ ఘనతే అని ప్రచారం జోరందుకుంటుంది. అప్పుడు.. మరింతగా కేసీఆర్ పాత్ర టీఆర్ఎస్ లో పరిమితం అయ్యే అవకాశం ఉందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అందుకే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారానికి తనంతట తనే రావొద్దని నిర్ణయించుకున్నారా.. కేటీఆర్ కోసం ఎవరైనా ఒత్తిడి చేస్తూ రావొద్దని చెప్పారా.. అన్నది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతోంది.

టీఆర్ఎస్ అధినేతగా.. ముఖ్యమంత్రిగా.. ఈ విషయంలో కేసీఆర్ మౌనం వీడితే తప్ప.. ఈ ప్రశ్నకు, ఊహాగానాలకు సమాధానమైతే దొరకదు.

First Published:  16 Jan 2020 10:47 AM IST
Next Story