Telugu Global
NEWS

తెలుగు దేశం ఎమ్మెల్యేలూ.... మీరెక్కడ?

ప్రభుత్వ తీరుపై.. చంద్రబాబు విపరీతంగా పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. ఇంకా చేస్తానని చెబుతున్నారు కూడా. కానీ.. తెలుగుదేశానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మాత్రం.. చంద్రబాబు, లోకేశ్ వెంట నడవడం లేదు. కేశినేని నాని, గల్లా జయదేవ్ లాంటి ‘అమరావతి పరిధి’లోని నేతలు తప్ప.. మరెవరూ చంద్రబాబు వెంట కనిపించడం లేదు. వాళ్లు ఎందుకిలా చేస్తున్నారన్నది వాళ్లకే తెలియాలి. ఇప్పటికే గంటా వంటి ఎమ్మెల్యేలు.. 3 రాజధానుల ప్రతిపాదనకు జై కొట్టారు. మరికొందరు టీడీపీ […]

తెలుగు దేశం ఎమ్మెల్యేలూ.... మీరెక్కడ?
X

ప్రభుత్వ తీరుపై.. చంద్రబాబు విపరీతంగా పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. ఇంకా చేస్తానని చెబుతున్నారు కూడా. కానీ.. తెలుగుదేశానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మాత్రం.. చంద్రబాబు, లోకేశ్ వెంట నడవడం లేదు. కేశినేని నాని, గల్లా జయదేవ్ లాంటి ‘అమరావతి పరిధి’లోని నేతలు తప్ప.. మరెవరూ చంద్రబాబు వెంట కనిపించడం లేదు. వాళ్లు ఎందుకిలా చేస్తున్నారన్నది వాళ్లకే తెలియాలి.

ఇప్పటికే గంటా వంటి ఎమ్మెల్యేలు.. 3 రాజధానుల ప్రతిపాదనకు జై కొట్టారు. మరికొందరు టీడీపీ నేతలూ బహిరంగంగానే ప్రభుత్వ తీరుకు మద్దతు తెలుపుతున్నారు. కానీ.. చంద్రబాబు, లోకేశ్ మాత్రమే తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టూ చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను ఒక తాటిపైకి తేవడంలో.. పార్టీకి కచ్చితమైన వాయిస్ ను వినిపించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు.

ఈ విషయాన్ని చంద్రబాబు తెలిసే చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో.. లేదంటే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయలసీమ జిల్లాల్లో పార్టీకి నష్టం రాకుండా డబుల్ స్టాండ్ ప్లే చేస్తున్నారో తెలియదు కానీ.. తెలంగాణ ఉద్యమంలో మాదిరిగా.. పార్టీకి మాత్రం తీరని నష్టం చేస్తున్నారన్నది వాస్తవం. అదీ.. అధినేత స్థాయిలో ఉండి ఇలా చేయడం.. ఆ పార్టీ కార్యకర్తలకు బాధాకరమని అంటున్నారు.

First Published:  15 Jan 2020 6:58 AM IST
Next Story