బాబు పవన్ వెంట... పవన్ బీజేపీ వెంట!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జీవితంలో ఎన్నడూ పడని ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తన పార్టీని రాజకీయంగా బతికించుకునేందుకు అవసరమైన అన్ని దారుల్లోనూ నడుస్తున్నారు. ఒకేసారి రెండు మూడు రకాల ప్రయత్నాలు చేస్తూ.. తనలోని పూర్తి రాజకీయ నాయకుడిని బయటపెడుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమినుంచి పార్టీని బయటకు తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన.. గత ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితం అయ్యింది. అలాంటి పార్టీ వెంట బాబు పడుతున్న తీరు చూసి.. తెలుగు తమ్ముళ్లే […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జీవితంలో ఎన్నడూ పడని ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తన పార్టీని రాజకీయంగా బతికించుకునేందుకు అవసరమైన అన్ని దారుల్లోనూ నడుస్తున్నారు. ఒకేసారి రెండు మూడు రకాల ప్రయత్నాలు చేస్తూ.. తనలోని పూర్తి రాజకీయ నాయకుడిని బయటపెడుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమినుంచి పార్టీని బయటకు తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
జనసేన.. గత ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితం అయ్యింది. అలాంటి పార్టీ వెంట బాబు పడుతున్న తీరు చూసి.. తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. ఏ సభ ఏర్పాటు చేసినా.. ఏ సమావేశం ఏర్పాటు చేసినా.. పవన్ కల్యాణ్ ను అలా అన్నారు.. పవన్ కల్యాణ్ ను ఇలా అన్నారు… అంటూ ఆయనకు భాగా ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. మరోవైపు.. పవన్ మాత్రం బీజేపీకి జై కొట్టే అన్ని అవకాశాలు వెతుక్కుంటూ బిజీగా ఉన్నారు.
ఈ పరిణామమే తెలుగుదేశం కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. పవన్ కు ఇచ్చిన ప్రాధాన్యం.. లోకేశ్ కు కూడా ఇవ్వడం లేదేంటి.. అన్న విషయం వారికి అర్థం కావడంలేదు. అలాగే.. పవన్ గురించి చంద్రబాబు పడినంత ఆరాటం.. చంద్రబాబు గురించి పవన్ చూపించడం లేదే.. అన్న వాస్తవాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడే.. కొత్త కొత్త అనుమానాలు పుట్టుకువస్తున్నాయి.
కొంతమంది తెలుగుదేశం ప్రత్యర్థులు చెబుతున్నట్టు.. పవన్ కల్యాణ్ నిజంగా చంద్రబాబు కోసమే రాజకీయం చేస్తున్నారా? అందుకే ఆయన దిల్లీలో.. ఈయన అమరావతిలో పోరాటాలు చేస్తూ.. ఐక్యంగా అంతర్గత అవగాహనతో పని చేస్తున్నారా?… వైఎస్ఆర్ కాంగ్రెస్ జోరును తట్టుకునేందుకు.. అడ్డుకునేందుకు.. బీజేపీ మద్దతు ఉంటే తప్ప వీలు కాదన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారా? అందుకే పవన్ ను ఇలా వాడుతున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక్కడే ఓ విషయం మాత్రం క్లియర్ కట్ గా తెలిసిపోతోంది. తన స్థాయిని దిగజార్చుకుని మరీ.. తన పార్టీ అగ్ర నేతలను కాదనుకుని మరీ.. చంద్రబాబు ప్రవర్తిస్తున్న, వ్యవహరిస్తున్న తీరు.. పార్టీ నాయకులను మాత్రం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఇది.. ఎలాంటి పరిణామాలను కలిగిస్తుందన్నది తెలియాలంటే.. ఇంకొంత కాలం ఆగాల్సిందే.