ఇలా చేస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా... విశాఖ రాజధానిగా ఒప్పుకుంటా...
ఏపీకి 3 రాజధానులు అవసరం అని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ విశాఖకు రాజధానిని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్ కు చంద్రబాబు కొత్తగా సవాల్ చేశారు. మంగళవారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే వైసీపీకి చెందిన 151మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని.. ప్రజలు అనుకూలంగా తీర్పునిస్తే […]
ఏపీకి 3 రాజధానులు అవసరం అని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ విశాఖకు రాజధానిని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్ కు చంద్రబాబు కొత్తగా సవాల్ చేశారు. మంగళవారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే వైసీపీకి చెందిన 151మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని.. ప్రజలు అనుకూలంగా తీర్పునిస్తే రాజధానిని విశాఖకే మార్చుకోవాలని చంద్రబాబు అన్నారు. వైసీపీ గెలిస్తే తాను పూర్తిగా రాజకీయాలను వదిలేస్తానని స్పష్టం చేశారు. అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వేల సంవత్సరాల క్రితమే అమరావతి కేంద్రంగా రాజ్యం ఉందని బాబు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మూడు రాజధానులపై ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధానుల అంశంపై ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక అమరావతి మార్పునకు నిరసనగా ప్రతీ ఒక్కరూ సంక్రాంతి సంబురాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.