Telugu Global
NEWS

3 రాజధానులపై బాలయ్య గప్ చుప్... కారణం అదేనా?

పరిపాలన రాజధానిని విశాఖకు మార్చకుండా చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఎంత చేయాలో అంత చేస్తూ జోలెపట్టి మరీ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ అడుక్కుంటున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలందరూ అప్పుడో ఇప్పుడో స్పందించారు. కానీ విశేషం ఏంటంటే ఈ కీలకమైన వివాదాస్పద అంశంలో టీడీపీ ఎమ్మెల్యే కం  హీరో బాలక్రిష్ణ ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే చిరంజీవి, నారా రోహిత్ వరకూ సినీ ప్రముఖులు […]

3 రాజధానులపై బాలయ్య గప్ చుప్... కారణం అదేనా?
X

పరిపాలన రాజధానిని విశాఖకు మార్చకుండా చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఎంత చేయాలో అంత చేస్తూ జోలెపట్టి మరీ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ అడుక్కుంటున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలందరూ అప్పుడో ఇప్పుడో స్పందించారు. కానీ విశేషం ఏంటంటే ఈ కీలకమైన వివాదాస్పద అంశంలో టీడీపీ ఎమ్మెల్యే కం హీరో బాలక్రిష్ణ ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే చిరంజీవి, నారా రోహిత్ వరకూ సినీ ప్రముఖులు ఎంతో మంది 3 రాజధానుల ప్రతిపాదనపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇంత కీలకమైన అంశంపై బాలక్రిష్ణ మాత్రం స్పందించడం లేదు. బాలక్రిష్ణ మౌనాన్ని ఏపీ ప్రజలు, ఆయనను గెలిపించిన వారు ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇప్పుడు బాలయ్య ఒక్క ప్రాంతానికి ప్రయోజనం కలిగించేలా ఉన్న అమరావతి ఆందోళనలపై వ్యూహాత్మకంగా నిశ్శబ్ధాన్ని పాటిస్తున్నాడని అర్థమవుతోంది.

బాలయ్య ప్రస్తుతం రాయలసీమలోని హిందూపూర్ ఎమ్మెల్యే. అక్కడి ప్రజలు ‘కర్నూలు- న్యాయ రాజధానికి’ సపోర్టుగా నిలుస్తున్నారు. అందుకే వారి ప్రతినిధిగా 3 రాజధానులను బాలయ్య వ్యతిరేకించలేరు. అదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలతోనూ బాలయ్యకు మంచి సంబంధాలున్నాయి. ఆయన అల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీగా పోటీచేశారు.

ఇక తన సొంతూరు ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాల ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లడం ఇష్టం లేదు. అందుకే బాలయ్య మొత్తం ఈ వివాదానికి దూరంగా జరిగారని తెలుస్తోంది.

First Published:  14 Jan 2020 6:49 AM IST
Next Story