"అలా" డ్రీమ్ రన్ కొనసాగుతోంది
అల వైకుంఠపురములో… సినిమా హిట్ అవుతుందని యూనిట్ భావించింది కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని వాళ్లు ఊహించలేదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇంత క్రేజ్ వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ప్రీమియర్స్ కు కూడా టిక్కెట్ రేట్లు పెంచకుండా విడుదల చేశారు. అయినప్పటికీ ప్రీమియర్స్ లో ఈ సినిమాకు 8 లక్షల డాలర్లు వచ్చాయి. అలా ఊహించని విధంగా ఓవర్సీస్ లో సక్సెస్ అయిన ఈ సినిమా తాజాగా 1.5 మిలియన్ డాలర్లు ఆర్జించి […]
అల వైకుంఠపురములో… సినిమా హిట్ అవుతుందని యూనిట్ భావించింది కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని వాళ్లు ఊహించలేదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇంత క్రేజ్ వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ప్రీమియర్స్ కు కూడా టిక్కెట్ రేట్లు పెంచకుండా విడుదల చేశారు. అయినప్పటికీ ప్రీమియర్స్ లో ఈ సినిమాకు 8 లక్షల డాలర్లు వచ్చాయి. అలా ఊహించని విధంగా ఓవర్సీస్ లో సక్సెస్ అయిన ఈ సినిమా తాజాగా 1.5 మిలియన్ డాలర్లు ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది.
బన్నీ కెరీర్ లోనే ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా, త్వరలోనే అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలవబోతోంది. అమెరికాలో కూడా సంక్రాంతి సీజన్ నడుస్తోంది. తెలుగు ప్రజలంతా ఆఫీసులకు సెలవులు పెట్టారు. సో.. యూఎస్ లో మరో 3 రోజుల పాటు ఈ సినిమా హవా కొనసాగే ఛాన్స్ ఉంది. అదే కనుక జరిగితే మరో 3 రోజుల్లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాతో త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టినట్టయింది. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి జులాయి సినిమా చేశారు. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశారు. అది కూడా హిట్ అయింది. ఇప్పుడు ఆ రెండు సినిమాల్ని మించిన రేంజ్ లో సూపర్ హిట్ అయింది అల వైకుంఠపురములో సినిమా.