Telugu Global
NEWS

మాకే మంచిది.... ఏపీ 3 రాజధానులపై రేవంత్ రెడ్డి కామెంట్స్

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా కొత్త చర్చకు తెర తీశారని కూడా చెప్పవచ్చు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కుప్పకూలిపోయే దశలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఫలితంగా.. తెలంగాణకే మేలు జరుగుతోందని అన్నారు. తెలంగాణకు చెందినవాడిగా… తనకు ఈ పరిణామం ఆనందంగానే ఉందని కూడా వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన […]

మాకే మంచిది.... ఏపీ 3 రాజధానులపై రేవంత్ రెడ్డి కామెంట్స్
X

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా కొత్త చర్చకు తెర తీశారని కూడా చెప్పవచ్చు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కుప్పకూలిపోయే దశలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఫలితంగా.. తెలంగాణకే మేలు జరుగుతోందని అన్నారు.

తెలంగాణకు చెందినవాడిగా… తనకు ఈ పరిణామం ఆనందంగానే ఉందని కూడా వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి సంబంధించిన ఆస్తులన్నీ అమ్ముడయ్యే వరకు ఆంధ్రాలో ఈ పరిస్థితి ఉంటుందని జోస్యం చెప్పారు.

ఇక్కడే మరో అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించడం.. ఇది కూడా కాస్త విచిత్రంగా ఉండడం.. చర్చనీయాంశమైంది. తెలంగాణ వాడిగా.. ఏపీలోని పరిణామాలను చూసి ఆనందిస్తున్నానని చెప్పిన రేవంత్.. తాను భారతీయుడిగా మాత్రం ఈ పరిణామంపై బాధగా ఉందన్నారు.

అంటే… తెలంగాణవాళ్లు భారతీయులు కారనా… అన్న చర్చ ఇక్కడ సహజంగానే వచ్చేసిందిక్కడ. ఈ విషయాన్ని కూడా పక్కనపెడితే… తెలుగు రాష్ట్రాల ప్రస్తావనలో ఆయన చేసిన వ్యాఖ్యలే.. గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును గుర్తుచేస్తున్నాయి.

ఆ నాడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్పష్టంగా వినిపించిన చంద్రబాబు మాదిరే.. నేడు రేవంత్ రెడ్డి కూడా రెండు కళ్ల సిద్ధాంతాన్ని వినిపించడం.. కాకతాళీయమో.. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధ ఫలమో వారికే తెలియాలి.

మామూలుగానే.. తిమ్మిని బమ్మిని.. బమ్మిని తిమ్మిని చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తుంటారు. తాజాగా అమరావతి వ్యవహారంలోనూ ఆయన అలాగే ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వినిపిస్తున్నాయి.

ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా.. చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నాయని.. ఆయన హావభావాలు కూడా రెండు కళ్ల సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అనుకుంటున్నారు.

First Published:  13 Jan 2020 3:17 PM IST
Next Story