Telugu Global
NEWS

పృథ్వీ వ్యవహారం... అన్నీ చకచకా జరిగిపోయాయి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి…. కొందరికి నచ్చవచ్చు… మరి కొందరికి నచ్చకపోవచ్చు… అది సహజం. కానీ… ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి స్పందించిన తీరును అభినందించాల్సిందే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారంలో.. చాలా వేగంగా స్పందించిన తీరును అంతా ప్రశంసిస్తున్నారు. వివాదం వెలుగు చూసిన ఒకే ఒక్క రోజులో.. అంతా సద్దుమణిగేలా చేసి.. కఠిన చర్యలు తీసుకున్న […]

పృథ్వీ వ్యవహారం... అన్నీ చకచకా జరిగిపోయాయి...
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి…. కొందరికి నచ్చవచ్చు… మరి కొందరికి నచ్చకపోవచ్చు… అది సహజం.

కానీ… ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి స్పందించిన తీరును అభినందించాల్సిందే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారంలో.. చాలా వేగంగా స్పందించిన తీరును అంతా ప్రశంసిస్తున్నారు. వివాదం వెలుగు చూసిన ఒకే ఒక్క రోజులో.. అంతా సద్దుమణిగేలా చేసి.. కఠిన చర్యలు తీసుకున్న ఆయన తీరుకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాదు… కొందరు ప్రతిపక్ష నాయకులు కూడా అభినందిస్తున్నారు.

ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడారంటూ.. వెలుగులోకి వచ్చిన ఆడియో టేప్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఇందులో ఉన్న గొంతు పృథ్వీదేనా.. కాదా… అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ విషయంలో వచ్చిన విమర్శలను మాత్రం సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

ఇందుకు నిదర్శనంగా.. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పృథ్వీ మీడియా సమావేశం పెట్టడం.. తర్వాత పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.

అంతే కాదు… తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు కూడా ఈ వ్యవహారంపై విచారణకు సిద్ధమయ్యారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి.. ఆ ఆడియో టేపుల్లోని గొంతు పృథ్వీదేనా? కాదా? అన్నది తేల్చే దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ నివేదిక ఏ రకంగా వచ్చినా.. ఇప్పుడు పృథ్వీ పదవి నుంచి దిగిపోయారు. తాను అసలు తప్పే చేయలేదని.. తన వాయిస్ తో ఉన్న ఆడియో టేప్ ఫేక్ అని…. పార్టీపై గౌరవంతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

పృథ్వీ రాజీనామా చేసేవరకు వెళ్లిందంటే.. జగన్ ఎంతో సీరియస్ అయి ఉంటారని.. ఆయన ఆదేశానుసారమే పృథ్వీ రాజీనామా చేసి ఉంటారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అవినీతిని నిర్మూలించే దిశగా తమ ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని.. పదే పదే చెప్పే సీఎం జగన్.. ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారని.. అందులో భాగంగానే పృథ్వీని పదవి నుంచి తప్పించి ఉంటారని చెబుతున్నారు.

ఇకపై.. ఇలా పబ్లిక్ గా ఆరోపణలతో ఏమైనా కథనాలు వచ్చినా.. ఇంతకంటే కఠినంగా వ్యవహరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. అందుకే.. సామాన్య కార్యకర్తలతో పాటు.. మంత్రుల వరకూ జాగ్రత్తగా ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు.

పృథ్వీ రాజీనామా అనంతరం… తెలుగు దేశం నేతలు కూడా సైలెంట్ అయిపోయారు.

First Published:  13 Jan 2020 4:46 PM IST
Next Story