మధురైలో ఆత్మహత్యాయత్నం.. అమరావతి ఖాతాలో వేసుకున్న టీడీపీ
ఫేక్ ప్రచారం ఏపీలో తారా స్థాయికి చేరింది. గుండెపోటు మరణాలను కూడా అమరావతి ఖాతాలో టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కలిపేస్తుండగా… టీడీపీ సోషల్ మీడియా ఫేక్ ఆత్మహత్యలను అమరావతి ఖాతాలో వేస్తోంది. రెండు రోజుల క్రితం తమిళనాడులోని మధురైలో ఒక వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భార్య చనిపోవడంతో అది తట్టుకోలేక అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్‌తో ఎగిరి కిందపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆత్మహత్యాయత్నం […]
ఫేక్ ప్రచారం ఏపీలో తారా స్థాయికి చేరింది. గుండెపోటు మరణాలను కూడా అమరావతి ఖాతాలో టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కలిపేస్తుండగా… టీడీపీ సోషల్ మీడియా ఫేక్ ఆత్మహత్యలను అమరావతి ఖాతాలో వేస్తోంది. రెండు రోజుల క్రితం తమిళనాడులోని మధురైలో ఒక వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు.
తన భార్య చనిపోవడంతో అది తట్టుకోలేక అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్‌తో ఎగిరి కిందపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తం పేరు శక్తి.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన టీడీపీ నెటిజన్లు… అమరావతి కోసం వ్యక్తి ఆత్మహత్య అంటూ ప్రచారం మొదలుపెట్టారు. తెలియక చాలా మంది దాన్ని వైరల్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు. దీన్నిచూసి టీడీపీ వారు ఆనందిస్తున్నారు. ఈ వీడియోను వైరల్ చేయవద్దని… అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు పోలీసులు హెచ్చరించారు.