Telugu Global
NEWS

నారా లోకేషే సెటిల్ చేశారు " కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు స్వీకరించి ఎగ్గొట్టిన కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో నారా లోకేష్ ప్రమేయం కూడా ఉన్నట్టు కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ మధుసూదన్‌ రెడ్డి వివరించారు. డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నం చేద్దామని తాను చెబుతుంటే అందుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన బంధువులు బెదిరిస్తున్నారని.. చంపేస్తామంటున్నారని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి మధుసూదన్ రెడ్డి వివరించారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి వియ్యంకుడైన కేశవరెడ్డి తన విద్యాసంస్థల పేరుతో 700 […]

నారా లోకేషే సెటిల్ చేశారు  కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్
X

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు స్వీకరించి ఎగ్గొట్టిన కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో నారా లోకేష్ ప్రమేయం కూడా ఉన్నట్టు కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ మధుసూదన్‌ రెడ్డి వివరించారు. డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నం చేద్దామని తాను చెబుతుంటే అందుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన బంధువులు బెదిరిస్తున్నారని.. చంపేస్తామంటున్నారని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి మధుసూదన్ రెడ్డి వివరించారు.

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి వియ్యంకుడైన కేశవరెడ్డి తన విద్యాసంస్థల పేరుతో 700 కోట్లు డిపాజిట్లు సేకరించారు. కానీ తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఈ కుంభకోణం టీడీపీ హయాంలో వెలుగులోకి వచ్చింది. దాంతో టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి చక్రం తిప్పి కేశవరెడ్డికి అండగా నిలిచారు.

ఇప్పుడు స్కూల్ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. ఈ కుంభకోణం మొత్తం ఆదినారాయణరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని వివరించారు. డిపాజిట్లు తిరిగి చెల్లించడం ఆదినారాయణరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆస్తులు కాపాడుకునేందుకు ఆ పార్టీలోకి ఆది వెళ్లారని మధుసూదన్ రెడ్డి వివరించారు.

డిపాజిట్లు చెల్లించకుండా, ఆస్తులు కాపాడుకునేందుకు టీడీపీ పెద్దలతో ఒప్పందం చేసుకున్నారని… అందులో భాగంగా నారా లోకేష్‌కు విజయవాడ సమీపంలోని అత్యంత విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని అప్పగించారని మధు వివరించారు. నాటి మంత్రి గంటా శ్రీనివాసరావుకు 5 కోట్లు ముట్టజెప్పామన్నారు.

కేశరెడ్డి విద్యాసంస్థల సొసైటీలోకి నారా లోకేష్ బినామీలను చేర్చుకోవాలంటూ తమపై ఆదినారాయణరెడ్డి ఒత్తిడి తెచ్చారని మధుసూదన్ రెడ్డి వివరించారు. ఆదినారాయణరెడ్డి నుంచి ప్రాణహాని ఉందని… రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని ఆయన కోరారు.

First Published:  8 Jan 2020 5:35 AM IST
Next Story