Telugu Global
NEWS

ఇండోర్ టీ-20లో భారత్ జోరు

7 వికెట్లతో అలవోకగా నెగ్గిన విరాట్ సేన శ్రీలంకతో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ బోణీ కొట్టింది. తన విజయాల అడ్డా ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో టీ-20లో భారత్ 7 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సంపాదించింది. గౌహతీవేదికగా జరిగిన తొలివన్డే వానదెబ్బతో రద్దు కావడంతో..ఈ రెండోవన్డే రెండుజట్లకూ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్… ప్రత్యర్థి శ్రీలంకను 20 ఓవర్లలో 142 […]

ఇండోర్ టీ-20లో భారత్ జోరు
X
  • 7 వికెట్లతో అలవోకగా నెగ్గిన విరాట్ సేన

శ్రీలంకతో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ బోణీ కొట్టింది. తన విజయాల అడ్డా ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో టీ-20లో భారత్ 7 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సంపాదించింది.

గౌహతీవేదికగా జరిగిన తొలివన్డే వానదెబ్బతో రద్దు కావడంతో..ఈ రెండోవన్డే రెండుజట్లకూ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్… ప్రత్యర్థి శ్రీలంకను 20 ఓవర్లలో 142 పరుగులకే పరిమితం చేయగలిగింది.

భారత యువఫాస్ట్ బౌలర్లు నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ కట్టుదిట్టంగా బౌల్ చేసి..5 వికెట్లు పడగొట్టారు.

భారత ఓపెనర్ల దూకుడు…

143 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శిఖర్ ధావన్- రాహుల్ మొదటి వికెట్ కు 9.1 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యం చేర్చడం ద్వారా చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

ఆ తర్వాత రాహుల్ 45, ధావన్ 32 పరుగుల స్కోర్లకు లెగ్ స్పిన్నర్ హసరంగ బౌలింగ్ లో ఒకరి వెనుక ఒకరుగా అవుటయ్యారు. వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ 26 బాల్స్ లో 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 34 పరుగులు చేయడం ద్వారా విజయానికి మార్గం సుగమం చేశాడు.

కెప్టెన్ కొహ్లీ 30, రిషభ్ పంత్ 1 పరుగుతో అజేయంగా నిలవడంతో భారత్ మరో 15 బాల్స్ మిగిలి ఉండగానే 7 వికెట్ల విజయం సొంతం చేసుకోగలిగింది.

భారత్ విజయంలో ప్రదానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సిరీస్ లోని ఆఖరి టీ-20 పూణే వేదికగా శుక్రవారం జరగనుంది.

First Published:  8 Jan 2020 5:30 AM IST
Next Story