లోకేష్‌ను అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశావ్... అమరావతి కోసం సీమ నుంచి తరలివస్తాం...
రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే వైసీపీ వారికి ఎలా రాత్రి నిద్రపడుతోందో అర్థం కావడం లేదన్నారు టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ . రైతులపై కక్షసాధిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు. అమరావతి రైతుల బాధ చూస్తుంటే రాయలసీమ రైతులు కూడా బాధపడుతున్నారన్నారు. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టినా రాయలసీమ రైతులు స్పందించరు అన్న భావనతో ప్రభుత్వం ఉందన్నారు. రోడ్ల మీద మహిళలు ధర్నాలు చేస్తూ పోలీసులతో కేసులు పెట్టించుకుంటున్నారన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే అమరావతి ప్రాంతాన్ని […]
రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే వైసీపీ వారికి ఎలా రాత్రి నిద్రపడుతోందో అర్థం కావడం లేదన్నారు టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ . రైతులపై కక్షసాధిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు. అమరావతి రైతుల బాధ చూస్తుంటే రాయలసీమ రైతులు కూడా బాధపడుతున్నారన్నారు. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టినా రాయలసీమ రైతులు స్పందించరు అన్న భావనతో ప్రభుత్వం ఉందన్నారు.
రోడ్ల మీద మహిళలు ధర్నాలు చేస్తూ పోలీసులతో కేసులు పెట్టించుకుంటున్నారన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే అమరావతి ప్రాంతాన్ని అల్లకల్లోలం చేశారని అఖిలప్రియ ఆరోపించారు. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం అయిపోగానే రాయలసీమ మీద పడతారేమోనని భయంగా ఉందన్నారు.
అసలు ఈ ప్రభుత్వానికి తలకాయ ఉందా? అని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఉన్నారా? లేరా? అని మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నా ముఖ్యమంత్రి ఒక ప్రెస్‌మీట్ పెట్టే స్థితిలో కూడా లేరన్నారు. రైతులు కన్నీరుపెడితే రాష్ట్రం నాశనం అయిపోతుందన్నారు. అది జరగకముందే రాజకీయ నాయకులంతా మారాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారామె.
అన్నంపెట్టే రైతును అమరావతిలో ఏడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. హిట్లర్ కూడా ఇలాగే పరిపాలన చేశారని … కానీ ఆయనకు ఆఖరిలో ఏం జరిగిందో వైసీపీ పెద్దలు గుర్తించుకోవాలన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయకపోతే రాయలసీమ నుంచి తామంతా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
లోకేష్‌ను అరెస్ట్ చేసి జగన్‌మోహన్ రెడ్డి పెద్ద తప్పు చేశారన్నారు. పాలించడం చేతగాకపోతే జగన్‌మోహన్ రెడ్డి తక్షణం చేతకావడం లేదని అంగీకరించి దిగిపోవాలని డిమాండ్ చేశారు అఖిలప్రియ.
లోకేష్‌ను అరెస్ట్ చేయడాన్ని ప్రతి రైతు ఖండిస్తున్నారని అఖిలప్రియ చెప్పారు. జగన్‌ను గెలిపించి పిచ్చోడి చేతికి రాయి ఇచ్చామే అని జనం బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం తామూ వస్తామని… తమను కూడా అరెస్ట్ చేస్తారా? అని అఖిలప్రియ చాలెంజ్ చేశారు. జగన్ ప్రభుత్వం వేసిన రీలే మళ్లీ మళ్లీ వేస్తోందన్నారు.
కర్నూలుకు హైకోర్టు ఇస్తే దాన్ని ఏం చేసుకోవాలని అఖిలప్రియ ప్రశ్నించారు. రాయలసీమకు హైకోర్టు ముఖ్యం కాదని… నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు ప్రజల మధ్య ఉన్న జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు ప్రజల మధ్యలోకి రావడం లేదు అని నిలదీశారు. ముఖ్యమంత్రి వచ్చి ధర్నా చేస్తున్న వారితో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. లోకేష్‌ను అరెస్ట్ చేసినంత మాత్రాన వెనక్కు తగ్గుతామనుకోవద్దని… అమరావతి కోసం రాయలసీమ నుంచి తాము కూడా తరలివస్తామని జగన్‌మోహన్ రెడ్డిని హెచ్చరించారు.